చంద్రబాబు వైపా, ఈవైపా: హరీష్ అల్టిమేటం, అంతా ఒకేసారి చేయండి: టిడిపి
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు తెలంగాణ ప్రజల పక్షమా లేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పక్షమా తేల్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆదివారం నిజామాబాద్ జిల్లాలో అల్టిమేటం జారీ చేశారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమన్నారు. జిల్లాలోని బీర్కూరు మండలం చించెల్లిలో లిఫ్టు ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మూడేళ్లలో గోదావరి, ఇంద్రావతి నదులను అనుసంధానం చేసి నిజాంసాగర్ ద్వారా జిల్లా ప్రజలకు చివరి ఆయకట్టు వరకు నీరిందిస్తామన్నారు.
గత ప్రభుత్వాలు తెలంగాణలో ప్రాజెక్టులు కట్టి ఉంటే ఇవాళ తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరిగి ఉండేవి కావన్నారు. రైతులెవరూ అధైర్య పడొద్దన్నారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. రైతులు పంట నష్ట పరిహారం ఇస్తామన్నారు.

మంచినీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగం: తుమ్మల
ఖమ్మం జిల్లాలో ఉన్న చెరువులన్నింటిని పునరుద్దరిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రతీ ఇంటికి మంచినీటిని ఇస్తామన్నారు. రాబోయే నాలుగేళ్లలో ఇంటింటికి మంచినీటిని అందించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమన్నారు.
కూసుమంచి మండలం జీళ్ల చెరువులో వాటర్ గ్రిడ్ పైలాన్‌ను మంత్రులు కేటీఆర్, తుమ్మల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడారు. తెలంగాణ ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సంక్షేమ పథకాల కోసం రూ.38 వేల కోట్లు ఖర్చుచేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదన్నారు.
రుణమాఫీ అంతా ఒకేసారి చస్తే: ఎర్రబెల్లి
రైతులకు రుణమాఫీ అంతా ఒకేసారి చేస్తే ఆత్మహత్యలు ఆగుతాయని తెలంగాణ టిడిపి శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు ఆదివారం అన్నారు. తెలంగాణ టిడిపి నేతలు ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి, ఎల్ రమణ, రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకునేలా కేబినెట్లో చర్చించలేదన్నారు. కేంద్రం పైన ఒత్తిడికి ఈ నెల 22వ తేదీన ఢిల్లీకి వెళ్తున్నట్లు చెప్పారు. రైతు రుణమాఫీ పైన కేబినెట్‌వి కంటితుడుపు చర్యలన్నారు. రైతుల ప్రయివేటు అప్పుల పైన కూడా మారటోరియం విధించాలన్నారు.












Click it and Unblock the Notifications