Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రెండు రాష్ట్రాల సౌభాగ్యం: తిరుమలలో హరీశ్, తుమ్మల పూజలు(పిక్చర్స్)

తిరుపతి: తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావులు ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం విరామ సమయంలో మంత్రులిద్దరూ సకుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.

దర్శనం అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించేలా అనుగ్రహించాలని ఏడుకొండలవాడిని కోరుకున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తిరుమల పర్యటన ఇంకా ఖరారు కాలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

మంత్రి హరీశ్ శనివారం విమానంలో రేణిగుంటకు వచ్చి కుటుంబసభ్యులతో కలిసి అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకోగా, తుమ్మల నాగేశ్వరరావు కుటుంబసభ్యులతో రోడ్డు మార్గంలో తిరుమలకు వచ్చారు. మంత్రులకు టీటీడీ అధికారులు ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం, దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఆ తర్వాత స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని ఆదివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం ఈవో పెనుమాక పూర్ణచంద్రరావు, అర్చకులు రాజగోపురం వద్ద స్వాగతం పలికారు.

అనంతరం వారు స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం హరీష్‌రావు కుటుంబ సభ్యులకు స్వామివారి పట్టువస్త్రాలు, తీర్థప్రసాదాలు, స్వామివారి జ్ఞాపికను ఈవో అందించారు. మూషిక మంపడంలో వేదపండితులు వారిని ఆశీర్వదించారు. ప్రాంగణంలోని వీరాంజనేయస్వామి, నవగ్రహాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

తిరుమలలో తుమ్మల

తిరుమలలో తుమ్మల

తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావులు ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.

ఫ్యామిలీతో హరీశ్ రావు

ఫ్యామిలీతో హరీశ్ రావు

శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం విరామ సమయంలో మంత్రులిద్దరూ సకుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.

తిరుమలలో హరీశ్ రావు

తిరుమలలో హరీశ్ రావు

దర్శనం అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించేలా అనుగ్రహించాలని ఏడుకొండలవాడిని కోరుకున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తిరుమల పర్యటన ఇంకా ఖరారు కాలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

శ్రీవారిసేవలో మంత్రులు

శ్రీవారిసేవలో మంత్రులు

మంత్రి హరీశ్ శనివారం విమానంలో రేణిగుంటకు వచ్చి కుటుంబసభ్యులతో కలిసి అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకోగా, తుమ్మల నాగేశ్వరరావు కుటుంబసభ్యులతో రోడ్డు మార్గంలో తిరుమలకు వచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+