వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శభాష్ రుద్రరచన.. భావోద్వేగానికి గురైన మంత్రి కేటీఆర్; స్పూర్తినిచ్చే ఆ యువతి కథ ఇదే!!

|
Google Oneindia TeluguNews

సాధించాలనే పట్టుదల ఉండాలి కానీ, జీవితంలో ఎదురయ్యే ఎటువంటి ఇబ్బందులు అవరోధం కాదని నిరూపించింది ఓ యువతి. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి ప్రభుత్వ పాఠశాలలో చదివి, అనాధాశ్రమం లో ఉంటూ ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసింది జగిత్యాల జిల్లా కు చెందిన రుద్ర రచన. నిరుపేద కుటుంబంలో పుట్టి చిన్నప్పటినుంచి అనేక కష్టాలు అనుభవించిన ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన రుద్ర రచన ఏకంగా నాలుగు ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికై అందరినీ అవాక్కయ్యేలా చేసింది. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సైతం భావోద్వేగానికి గురయ్యేలా చేసింది.

అనాధైన రుద్రరచన చదువుకు ఆర్ధిక సాయం చేసిన కేటీఆర్

అనాధైన రుద్రరచన చదువుకు ఆర్ధిక సాయం చేసిన కేటీఆర్

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాలకు చెందిన రుద్ర రచన చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి స్థానిక బాలసదన్ లో ఉంటూ జగిత్యాల ప్రభుత్వ బాలికల పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత హైదరాబాద్లోని స్టేట్ హోమ్ లో ఉంటూ పాలిటెక్నిక్ పూర్తి చేసింది. హైదరాబాద్ లోని ప్రముఖ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ సీటు సంపాదించింది. అయితే రుద్ర రచన ఆర్థిక ఇబ్బందులను సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కేటీఆర్ ఆమెను ప్రగతి భవన్ కు పిలిపించుకొని 2019లో ఆర్థిక సహాయం అందించారు.

నాలుగు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగం సాధించిన రుద్రరచన .. కేటీఆర్ కు రాఖీ

నాలుగు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగం సాధించిన రుద్రరచన .. కేటీఆర్ కు రాఖీ

ఇక ఇటీవల ఇంజనీరింగ్ పూర్తి చేసిన రుద్ర రచన నాలుగు ప్రముఖ కంపెనీలలో ఒకేసారి ఉద్యోగాలు సంపాదించింది. కాని చదువుకోడానికి సహాయం అందించిన మంత్రి కేటీఆర్ పట్ల తన అభిమానాన్ని ప్రదర్శించిన రుద్ర రచన సోమవారం ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను కలిసి, తన చదువుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపింది. అంతేకాదు తాను పొదుపు చేసుకున్న డబ్బులతో వెండి రాఖీ తయారు చేయించానని చెప్పిన రుద్ర రచన కేటీఆర్ కు వెండి రాఖీ కట్టింది. ఆమె చూపిన అభిమానానికి కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.

భావోద్వేగానికి గురైన మంత్రి కేటీఆర్ .. అండగా ఉంటానని హామీ

భావోద్వేగానికి గురైన మంత్రి కేటీఆర్ .. అండగా ఉంటానని హామీ


రుద్ర రచన చేత రాఖీ కట్టించుకున్న తాను ఆమె జీవితంలో మరింత స్థిరపడే వరకు చేసే ప్రతి ప్రయత్నానికీ అండగా ఉంటానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొని, వాటిని ఛాలెంజ్ గా తీసుకుని నాలుగు కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన రుద్ర రచన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి, సివిల్ సర్వెంట్ కావాలన్న తన లక్ష్యానికి అండగా ఉంటానని కేటీఆర్ రుద్ర రచనకు హామీ ఇచ్చారు.

English summary
Rudrarachana thanked Minister KTR for his financial support for her engineering studies as she got a job opportunity in four leading companies. KTR was emotional about Rudrarachana, who expressed her admiration with rakhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X