తస్మాత్ జాగ్రత్త: హైదరాబాద్‌ను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ...ఐదుగురు మృతి
హైదరాబాద్: ఇప్పటి వరకు తిరుపతి నగరాన్ని వణికించిన స్వైన్ ఫ్లూ మహమ్మారి హైదరాబాద్‌కు పాకింది. గత రెండు వారాల్లోనే పలు స్వైన్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి. ఇందులో ఈ వ్యాధితో బాధపడుతూ ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. నగరంలో స్వైన్ ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయని తెలంగాణ వైద్యవృత్తి డైరెక్టర్ రమేష్ రెడ్డి పేర్కొన్నారు. నగరవాసులు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
"ఇప్పటి వరకు స్వైన్ ఫ్లూ వ్యాధితో ఐదు మంది చనిపోయారు. స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్న ఇద్దరు ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో చేర్చారు. వారు చికిత్స పొందుతూ మృతి చెందారు. స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న మరో ముగ్గురు గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. వారు కూడా చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను అలర్ట్ చేశాం. స్వైన్ ఫ్లూ కిట్లను పంపిణీ చేశాం" అని రమేష్ రెడ్డి తెలిపారు.

స్వైన్ ఫ్లూ అనేది హెచ్1 ఎన్ 1 వైరస్. ఇది భారత్‌లో చాలా చోట్ల ఉంది. ఒక వ్యక్తికి హెచ్1 ఎన్ 1 వైరస్ సోకితే.. ఆ వ్యక్తి తుమ్మినా, ఆ వ్యక్తి పీలుస్తున్న గాలిని పీల్చనా పక్కనే ఉన్న వ్యక్తికి వ్యాపిస్తుంది. వైరల్ ఫీవర్, దగ్గు ,జలుబు, ఒళ్లు నొప్పులు వీటి లక్షణాలు. ఇది ఎక్కువగా చిన్నపిల్లలు, గర్భవతులు, వయస్సు మీద పడిన వారికి త్వరగా సోకే అవకాశాలున్నాయి.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications