హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వ్యాఖ్యల వివాదం.. సస్పెండ్ చెయ్యకుంటే వదిలిపెట్టం - హిందూసంఘాల అల్టిమేటం!!

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో దుమారం గా మారాయి. ఏసుక్రీస్తు వల్లనే కరోనా మహమ్మారి అంతమయ్యింది అని, వైద్యులు, మెడిసిన్ వల్ల కాదని చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో ఆయనపై మండిపడుతున్నాయి. బాధ్యతాయుతమైన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ పదవిలో ఉన్న ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి మతాలను ప్రేరేపించే విధంగా మాట్లాడతారా?

ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి మతాలను ప్రేరేపించే విధంగా మాట్లాడతారా?

విశ్వహిందూ పరిషత్ తెలంగాణ శాఖ ఈ మేరకు ఒక ప్రకటన వెల్లడించి తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఏసుక్రీస్తు వల్లనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఆయన మాట్లాడటం ఏమాత్రం తగదని విశ్వహిందూ పరిషత్ హెచ్చరిస్తోంది అని పేర్కొన్నారు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి మతాలను ప్రేరేపించే విధంగా మాట్లాడటం మంచిది కాదన్నారు. కిందిస్థాయి ఉద్యోగులకు ప్రభావితం చేసే విధంగా ఆయన మాట్లాడారు అన్నారు. హిందువులను కించపరిచే స్థాయిలో మాట్లాడటం తగదని తీవ్రంగా హెచ్చరించారు.

భారతదేశం అభివృద్ధి ఏసుక్రీస్తు వల్లనే... అర్ధం ఉందా?

భారతదేశం అభివృద్ధి ఏసుక్రీస్తు వల్లనే... అర్ధం ఉందా?

హెల్త్ డైరెక్టర్ గా ఉండి హిందుత్వాన్ని, వైద్య విధానాన్ని, సైన్స్ ను, శాస్త్రవేత్తలను కించపరిచే స్థాయిలో మాట్లాడటాన్ని వారు తీవ్రంగా ఖండించారు. మానవజాతికి ఏసుక్రీస్తు మాత్రమే దైవమని.. మిగతా దేవుళ్ళందరూ గ్రాఫిక్స్ అని కించపరిచే మాటలు మాట్లాడటాన్ని ప్రతి హిందువు తీవ్రంగా తప్పుపడుతున్నారని వారు ఆక్షేపించారు.ఏసుక్రీస్తు వల్లనే భారతదేశం అభివృద్ధి సాధిస్తుందని మాట్లాడటంలో అసలు అర్థం ఉందా అని ప్రశ్నించిన వారు, దేశాభివృద్ధికి ఏసుక్రీస్తుకు సంబంధం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా కట్టడికి అహోరాత్రులు శ్రమించింది వైద్య సిబ్బంది, శాస్త్రవేత్తలు కాదా ?

కరోనా కట్టడికి అహోరాత్రులు శ్రమించింది వైద్య సిబ్బంది, శాస్త్రవేత్తలు కాదా ?


కరోనా మహమ్మారిని అదుపుచేయడానికి లక్షల మంది వైద్యులు.. కోట్ల మంది వైద్య సిబ్బంది.. శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమించారన్న విషయాన్ని శ్రీనివాస్ రావు గారు విస్మరించడం ఆయన బుద్ధిలేనితనానికి నిదర్శనం అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ లోని ఉద్యోగులందరినీ హిందూ క్రైస్తవులుగా విభజించి, క్రైస్తవులకు మేలు కలిగే విధంగా ఆయన మాట్లాడారని విశ్వహిందూ పరిషత్ నాయకులు ఆరోపించారు. ఇది ముమ్మాటికి క్షమించరాని నేరమని తప్పుపట్టారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ నేతలు డిమాండ్ చేశారు.

మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేయడం నేరం

మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేయడం నేరం

ప్రభుత్వ ఉద్యోగులు మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేయడం నేరం అని అభిప్రాయం వ్యక్తం చేసిన వారు ఆయనపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పందించకపోతే హైకోర్టు ఆయనపై కేసు వేసి స్పెండ్ చేసే దాకా పోరాడుతామని హెచ్చరించారు. గతంలోనూ అనేక మార్లు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు చేసిన వివాదాస్పద ఘటనలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. హెల్త్ డైరెక్టర్ గా ఉండి శ్రీనివాసరావు కెసిఆర్ కాళ్ళు మొక్కారని, ప్రశ్నిస్తే తండ్రి లాంటి వాడని.. వందసార్లు కాళ్లు మొక్కుతా అంటూ ఓ బానిసలా సమాధానం చెప్పారని గుర్తు చేశారు.

 ఆయనను సస్పెండ్ చెయ్యండి...

ఆయనను సస్పెండ్ చెయ్యండి...


గతంలో మూఢనమ్మకాల పేరుతో పూజలు నిర్వహించి వైద్య విధానాన్ని అభాసుపాలు చేసే విధంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఇక తాజాగా ఏసుక్రీస్తు వల్లే కరోనా మహమ్మారి అంతం అయిందని మాట్లాడిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయనను సస్పెండ్ చెయ్యాలని వారు డిమాండ్ చేశారు. ఇది ఏ మాత్రం ఉపేక్షించదగిన అంశం కాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+