కేసీఆర్ పాదాలు తాకటం అదృష్టం; ఒక్కసారి కాదు వందసార్లు మొక్కుతా: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ తరగతులు సీఎం కేసీఆర్ ప్రారంభించిన కార్యక్రమంలో పాల్గొన్న హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలంగాణ సీఎం కేసీఆర్ కాళ్ళు మొక్కిన విషయం తెలిసిందే. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ముఖ్యమంత్రి కెసిఆర్ కాళ్లు మొక్కడానికి చాలా మంది తప్పుబట్టారు. ఒక ఉన్నతాధికారి ఈ విధంగా చేయడం సమంజసం కాదని పలువురు ఆక్షేపించారు.

కేసీఆర్ కాళ్ళు మొక్కటంపై వివరణ ఇచ్చిన హెల్త్ డైరెక్టర్

కేసీఆర్ కాళ్ళు మొక్కటంపై వివరణ ఇచ్చిన హెల్త్ డైరెక్టర్

అయితే ఈ విషయంపై తాజాగా మరోమారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు కొత్తగూడెంలో నిర్వహించిన వనం మహోత్సవంలో పాల్గొన్న హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కెసిఆర్ కాళ్ళు మొక్కితే తప్పేంటి అంటూ ప్రశ్నించారు. కొందరు కావాలనే ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒక్కసారి కాదు వందసార్లు తాను కేసీఆర్ కాళ్లు మొక్కుతా అని ఆయన పేర్కొన్నారు.

కేసీఆర్ పాదాలు తాకటం అదృష్టం: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

కేసీఆర్ పాదాలు తాకటం అదృష్టం: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

సీఎం కేసీఆర్ తనకు పితృ సమానులు అని పేర్కొన్న హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ పాదాలు తాకటం అదృష్టమని పేర్కొన్న ఆయన బంగారు తెలంగాణ దిశగా సాగుతున్న పాలనాదక్షుడు కేసీఆర్ అంటూ కెసిఆర్ పాలనకు కితాబిచ్చారు.కేసీఆర్ రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు.

కేసీఆర్ కాళ్ళు మొక్కిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

కేసీఆర్ కాళ్ళు మొక్కిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

తెలంగాణ హెల్త్ డైరెక్టర్శ్రీనివాసరావుకెసిఆర్కాళ్ళు పదే పదే మొక్కుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సీఎం కేసీఆర్ పై వీరు విధేయతను ప్రదర్శిస్తున్న ప్రభుత్వ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలోశ్రీనివాస రావు చేసిన పని పైన పలువురు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో అధికారుల పాద పూజలు పెరిగిపోతున్నాయనిచాలా మంది టార్గెట్ చేస్తున్నారు.

హెల్త్ డైరెక్టర్ కేసీఆర్ కాళ్ళు మొక్కటంపై విమర్శలు .. తాజా వివరణతో షాక్

హెల్త్ డైరెక్టర్ కేసీఆర్ కాళ్ళు మొక్కటంపై విమర్శలు .. తాజా వివరణతో షాక్

పలువురు శ్రీనివాసరావు కెసిఆర్ కాళ్ళు మొక్కే వీడియో పై కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బానిసత్వానికి కేరాఫ్ గామారిందని విమర్శలు గుప్పిస్తున్నారు.ఇంకొందరు పదవీకాలం పొడిగించడం కోసం కెసిఆర్కాళ్లు మొక్కి విధేయతను ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. మరి కొందరు కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ కావాలంటా అంటూ శ్రీనివాసరావును విమర్శిస్తున్నారు.ఆశ ,స్వార్థం మనుషులనుఎంతకైనాదిగజారుస్తుంది అని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు ఆయన తాను ఎలాంటి తప్పు చేయలేదని, కెసిఆర్ కాళ్లు మొక్కితే తప్పు ఏంటి అంటూ ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+