'తమ్ముడూ.. రాఖీ తెచ్చిన.. ఒక్కసారి లేవరా'..
విగతజీవిగా మారిన తన తమ్ముడికి ఓ సోదరి చితిపై రాఖీ కడుతున్న దృశ్యం అందరినీ కలచివేస్తోంది. చిన్నప్పుడే తల్లిని కోల్పోవడంతో ఆమె అన్నీ తానై తమ్ముడిని పెంచి పెద్దవాడ్ని చేసింది. కానీ విధి వైపరీత్యం కారణంగా ఆ యువకుడు చిన్న వయసులోనే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. రాఖీ పండగ సందర్భంగా తమ్ముడి కోసం రాఖీ కొని పెట్టుకున్న ఆ అక్కకు.. తన తమ్ముడికి ఇలా రాఖీ కట్టాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఈ క్రమంలో సోదరుడి మృతదేహానికి చితిపైనే రాఖీ కట్టి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ హృదయ విదారక సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది.
రాఖీ పండుగ వేళ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురంలో తీవ్ర విషాదం జరిగింది. చనిపోయి విగతజీవిగా మారిన తన తమ్ముడికి చితిపైనే రాఖీ కడుతూ గుండెలవిసేలా విలపించింది ఓ సోదరి. రాఖీ పండుగకు తమ్ముడికి రాఖీ కట్టేందుకు సిద్ధమైన ఆమెకు తన సోదరుడు మృతి చెందాడన్న వార్త అందింది. దీంతో బోరున విలపిస్తూ సోదరుడి కోసం కొన్న రాఖీని తీసుకుని పరుగున పుట్టింటికి వచ్చింది. విగతజీవిగా మారిన తన తమ్ముడికి చితిపైనే రాఖీ కడుతూ గుండెలవిసేలా రోదించింది.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం కు చెందిన పందిరి పెద్ద లింగారెడ్డి, శారద దంపతులు. వీరికి జ్యోతి, అప్పిరెడ్డి(24) అనే ఇద్దరు సంతానం ఉన్నారు. అప్పిరెడ్డి పుట్టిన కొన్ని రోజులకే తల్లి శారద కన్నుమూసింది. దీంతో తమ్ముడిని అన్నీ తానై పెంచి పెద్ద చేసింది సోదరి జ్యోతి. అలాగే తల్లి లేని లోటు తెలియకుండా తండ్రి పెద్ద లింగారెడ్డి పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచాడు.

ఆ తర్వాత కొన్నాళ్లకు జ్యోతికి వివాహం అయి అత్తారింటికి వెళ్లింది. అప్పిరెడ్డి.. జేసీబీ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. అయితే రెండు రోజుల క్రితం అప్పిరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచాడు. గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అక్క జ్యోతితోపాటు వరసకు సోదరీమణులయ్యే మరో 30 మంది వరకు బోరున విలపిస్తూ చితిపై ఉన్న అప్పిరెడ్డి మృతదేహానికి రాఖీలు కడుతూ రోదించారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications