Telangana: కృష్ణా బేసిన్ కలకల.. గోదావరి బేసిన్ విలవిల.. !
కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. ముఖ్యంగా కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వస్తోంది. జూరాల ప్రాజెక్ట్‌కు భారీగా వరద వస్తోంది. జూరాల ప్రాజెక్ట్ 46 గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 2,25,354 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 19,516 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్‌కు 1,500, భీమా-1కు 1,300, భీమా-2కి 750, సమాంతర కాల్వకు 300, లెఫ్ట్ కెనాల్‌కు 870, రైట్ కెనాల్‌కు 596 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
జూరాల నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.340 టీఎంసీల నీరు ఉంది.
శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి భారీగా ప్రవాహం వస్తోంది. గురువారం 2,54,700 క్యూసెక్కుల భారీ వరద శ్రీశైలంకు చేరింది. తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలంలోకి వరద వస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్ కెపాసిటీ 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 100 టీఎంసీల నీటి నిల్వ ఉంది. శ్రీశైలం నుంచి సాగర్‌కు 6,500 క్యూసెక్కులు వస్తున్నాయి. ఆల్మట్టి నుంచి 2.75 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా, నారాయణపూర్ నుంచి 2,50,028 క్యూసెక్కుల నీరు కిందికి చేరుతోంది.

ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్ట్ నుంచి దిగువకు మూడు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గోదావరి బేసిన్‌లో వరద ప్రవాహం నిలకడగా ఉంది. శ్రీరాంసాగర్‌కు 21,650 క్యూసెక్కుల వరద వస్తుండగా.. కడెం ప్రాజెక్టుకు 10,536 క్యూసెక్కులు, శ్రీపాద ఎల్లంపల్లికి 20,998 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. మేడిగడ్డ నుంచి 7.71 లక్షల క్యూసెక్కులు, సమ్మక్కసాగర్ నుంచి 9.5 లక్షల క్యూసెక్కులు, సీతమ్మసాగర్ నుంచి 11.48 లక్షల క్యూసెక్కులు, భద్రాచలం నుంచి 10.11 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదలుతున్నారు.
మేడిగడ్డ దిగువ నుంచి గోదావరిలో ప్రవాహం భారీగా ఉంది. కానీ.. పైన మాత్రం ప్రవాహం అంతంతమాత్రంగానే ఉంది. శ్రీరాంసాగర్ నిండాలంటే.. ఇంకా 70 టీఎంసీల వరద రావాలి. ఇటు మిడ్ మానేరు, లోయర్ మానేరుకు 45 టీఎంసీల నీరు కావాలి. మహారాష్ట్రతో పాటు నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తే గోదావరిలో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications