హైదరాబాద్‌లో రెండోరోజూ దంచికొట్టిన వర్షం: రాష్ట్రంలో మరో 3 రోజులపాటు జోరు వానలు

హైదరాబాద్: నగరంలో వరుసగా రెండో రోజూ కుండపోత వర్షం కురిసింది. మంగళవారం మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి కాస్త పొడి వాతావరణమే ఉన్నప్పటికీ.. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది.

లక్డీకపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, అబిడ్స్, ట్రూప్ బజార్, నాంపల్లి, బషీర్ బాగ్, నారాయణగూడ, హైదర్ గూడ, హిమాయత్ నగర్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, నాంపల్లి, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, మారేడ్ పల్లి, తిరుమలగిరి, బేగంపేట్, అల్వాల్, ప్యాట్నీ, ప్యారడైజ్, చిలకలగూడ, వారాసిగూడ, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో చాలా చోట్ల తీవ్ర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సోమవారం సాయంత్రం కూడా నగరంలో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే.

Heavy rain in hyderabad city: next 3 days rains in Telangana districts

ఇది ఇలావుండగా, మరో మూడు రోజులపాటు హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మంగళవారం వాయువ్య దాని పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోందని తెలిపింది. ఇది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని పేర్కొంది. మరొక ఉపరితల ఆవర్తనం తూర్పు, మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ 1న ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+