హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా భారీ వర్షం: రోడ్లు జలమయం, ట్రాఫిక్‌జాం

హైదరాబాద్: నగరంలో సోమవారం ఉదయం నుంచి మేఘావృత వాతావరణం ఉంది. అయితే, సోమవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు వచ్చి చేరింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బేగంపేట్, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, ఖైరతాబాద్, లక్డీకపూల్, మెహదీపట్నం, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, బేగంబజార్, చార్మినార్, రాణిగంజ్, ప్యాట్నీ, ప్యారడైజ్, సుచిత్ర, జీడిమెట్ల, చింతల్, బాల్ నగర్, కూకట్‌పల్లి, తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది.

Heavy Rain lashes in Hyderabad city today afternoon

కాగా, తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు, ఈదురు గాలులు తదితర హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.

భారత వాతావరణ శాఖ ప్రకారం.. హైదరాబాద్‌లోని మొత్తం ఆరు జోన్‌లు - చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, సికింద్రాబాద్, సెరిలింగంపల్లి - సెప్టెంబర్ 28 వరకు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.

Heavy Rain lashes in Hyderabad city today afternoon

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) డేటా ప్రకారం.. ఆదివారం నగరంలో సాయంత్రం వర్షం కురిసింది. బండ్లగూడలో అత్యధికంగా 12 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుత రుతుపవనాల సీజన్‌లో తెలంగాణలో సాధారణ వర్షపాతం 717.3 మిల్లీమీటర్లు దాటి 840.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో సాధారణ వర్షపాతం 589.5 మిమీ కంటే 724.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం కూడా నమోదైంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+