మొక్కుబడిగా పూజలు.. మీ తప్పులవల్లే కుంభవృష్టి వర్షాలు: 'భవిష్యవాణి'లో మాతంగి స్వర్ణలత!!

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఈరోజు అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. లష్కర్ బోనాల సందర్భంగా నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత తన భక్తులను తానే కాపాడుకుంటానని, ఎంత పెద్ద ఆపద వచ్చినా రక్షించి తీరుతానని అమ్మవారి వాక్కుగా చెప్పారు .

మొక్కుబడిగా పూజలు చేస్తున్నారు.. అందుకే కుండపోత వర్షాలు: భవిష్యవాణి

మొక్కుబడిగా పూజలు చేస్తున్నారు.. అందుకే కుండపోత వర్షాలు: భవిష్యవాణి


లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన రంగం కార్యక్రమంలో పచ్చి కుండపై నిలబడి తనలోనికి అమ్మవారిని ఆవాహన చేసుకుని భవిష్యవాణి చెప్పారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం లో మొక్కుబడిగా పూజలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను సంతోష పరచడం లేదని, సరిగ్గా పూజలు జరపడం లేదని పేర్కొన్న మాతంగి స్వర్ణలత, గతంలో చేసిన విధంగా పూజలు చేయడం లేదని అందుకే కుండపోత వర్షాలు కురిపిస్తున్నాను అంటూ అమ్మవారి భవిష్య వాణిలో పేర్కొన్నారు.

ప్రతీ సంవత్సరం తన రూపం మారుస్తున్నారంటూ ఆగ్రహం.. మీ కళ్ళు తెరిపించాలనే ఇలా

ప్రతీ సంవత్సరం తన రూపం మారుస్తున్నారంటూ ఆగ్రహం.. మీ కళ్ళు తెరిపించాలనే ఇలా

ప్రతి ఏటా చెబుతున్నా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సక్రమంగా పూజలు జరిపించాలని, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాలని మాతంగి స్వర్ణలత భవిష్యవాణి లో చెప్పారు.తాను ప్రజల హృదయాల్లో ఉంటూ అందరినీ కాపాడుతున్నానని, అయినా సంతోషంగా తనకు పూజలు చేయడం లేదని భవిష్యవాణిలో స్వర్ణలత చెప్పారు. ప్రతి సంవత్సరం తన రూపాన్ని మారుస్తున్నారు అంటూ మండిపడ్డారు. తనకు స్థిరమైన రూపం కావాలని కోరారు.

మీరు సరిగా పూజలు చేస్తున్నారా? ప్రశ్నించిన మాతంగి స్వర్ణలత

మీరు సరిగా పూజలు చేస్తున్నారా? ప్రశ్నించిన మాతంగి స్వర్ణలత

తన సంతోషం కోసం కాదు మీ అందరి సంతోషం కోసమే పూజలు చేయాలంటూ స్వర్ణలత భవిష్యవాణి లో చెప్పారు. గర్భాలయంలో శాస్త్రీయ విధానంలో పూజలు నిర్వహించాలని, ఇప్పటివరకు అంతా తన బిడ్డలని అన్నిటినీ సరిపెట్టుకున్నాను అని పేర్కొన్న మాతంగి స్వర్ణలత మీరు కళ్లు తెరవడానికి తాను కుంభవృష్టి వర్షాల కురిపిస్తున్నానని చెప్పారు. గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి మీరు సరిగా పూజలు చేస్తున్నారా అంటూ అమ్మవారి వాణిగా మాతంగి స్వర్ణలత ప్రశ్నించారు.

వర్షాలకు మీ తప్పులే కారణం.. మీకు కనువిప్పు కలగాలనే కుంభవృష్టి వానలు

వర్షాలకు మీ తప్పులే కారణం.. మీకు కనువిప్పు కలగాలనే కుంభవృష్టి వానలు

మీకు కనువిప్పు కలగాలని, అందు కోసమే ఈ కుంభవృష్టి వాన కురిపిస్తున్నాను అంటూ పేర్కొన్న మాతంగి స్వర్ణలత ఎన్ని తప్పులు చేసినా నా బిడ్డలేనని క్షమిస్తున్నాను అంటూ అమ్మవారి భవిష్యవాణి వినిపించారు.
ప్రతి ఒక్కరిని తాను కాపాడుకుంటానని ప్రజలకు ఎలాంటి ఆపద రానివ్వనని స్పష్టం చేశారు. అంతకు ముందు కూడామాతంగి స్వర్ణలత చెప్పినట్టుగానే హైదరాబాద్ లో వరదలు ముంచెత్తాయి. గత ఏడాది కూడా వర్షం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని మాతంగి స్వర్ణలత చెప్పారు. ఈ ఏడాది కుండపోత వానలకు మీ తప్పులే కారణం అన్నారు. ఇక ఈ రంగం కార్యక్రమంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+