వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పులిచింతలకు వరద: జాగ్రత్త.. హరీష్‌కు దేవినేని ఫోన్, వారి బాధలు వర్ణనాతీతం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: భారీ వర్షాల కారణంగా పులిచింతల ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తెలంగాణ మంత్రి హరీష్ రావుకు ఫోన్ చేశారు. పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

వర్షాలు: చెట్టును పట్టుకొని.. వరద పెరగడంతో పైకెక్కాడు, హెలికాప్టర్‌తోనల్గొండ జిల్లాలోని ప్రాజెక్టు ముంపు ప్రాంత గ్రామాలను వెంటనే అప్రమత్తం చేయాలని దేవినేని... హరీష్ రావుకు ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు. భారీ వర్షథాల నేపథ్యంలో సమన్వయంతో వ్యవహరిద్దామని చెప్పారు. దానికి మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించారు. వెంటనే నల్గొండ జిల్లా కలెక్టర్‌ను అప్రమత్తం చేస్తామని చెప్పారు. అనంతరం కలెక్టర్‌కు ఫోన్ చేసి అప్రమత్తం చేశారు.

Rain

30 టీఎంసీల కెపాసిటీ

పులిచింతల ప్రాజెక్టులో ఇప్పుడు 27.5 టీఎంసీల నీరు ఉంది. వరద నీరు భారీగా వస్తోంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 30 టీఎంసీలు. ఇప్పుడు 2.5 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. అవుట్ ఫ్లో 50వేల క్యూసెక్కులు ఉంది.

గుంటూరులో ఆగిపోయిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్

గుంటూరు జిల్లాలోని అనుపాలెం వద్ద వర్షాల కారణంగా ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్ ఆగిపోయింది. ట్రాక్ పైన వరద నీరు చేరడంతో ఉదయం ఏడు గంటల నుంచి వరద నీరు చేరింది. నీళ్లు, ఆహారం లేక ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు.

నిజాంపేట భండారి లే అవుట్‌లో ప్రజల ఇక్కట్లు

నిజాంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని భండారి లే అవుట్ చెరువును తలపిస్తోంది. ఎగువన ఉన్న తురక చెరువుకు గండిపడటంతో వరద నీరు ముంచెత్తింది. దాదాపు 220 అపార్టుమెంట్లు ఉండగా సుమారు 75 అపార్టుమెంట్ల సెల్లార్లలోకి నీరు చేరింది. అపార్టుమెంట్లలో నివాసం ఉంటున్న వారీలో చాలామంది ఇప్పటికే ఖాళీ చేయగా మిగిలిన వారు ఇబ్బందులు ప‌డుతున్నారు.

కాలనీ అంతటా విద్యుత్‌ సరఫరా నిలిచపోగా పాలు, ఇతర ఆహార పదార్థాల కోసం అలమటిస్తున్నారు. కనీసం తాగేందుకు మంచినీరు కూడా లేదని అపార్టుమెంటువాసులు ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రిమాపక శకటాల ద్వారా నీటిని తోడేస్తున్నప్పటికీ నీరు తరగడం లేదు.

గురువారం ఉద‌యం నుంచి ఐదు అగ్నిమాపక యంత్రాల ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు నీటిని తోడేస్తున్నప్పటికీ అంత ఫలితం లేదు. కాలనీలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు నాలుగైదురోజులు పడుతుందని స్థానికులు అంటున్నారు. మురుగు నీటి కాలువలు సైతం పొంగడంతో ఇబ్బందులు పడుతున్నారు. సెల్లార్లలో బురద పేరుకుపోయింది.

English summary
AP Minister Devineni Umamaheswara Rao calls TS Minister Harish Rao over Pulichinthala Project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X