వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Weather Today: ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అనవసరంగా బయటకెళ్లొద్దు..

|
Google Oneindia TeluguNews

తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్ర, శని వారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం ఏపీలోని కోస్తా తీరంతో పాటు ఉత్తరాఖండ్, ఛత్తీస్ గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మధ్య భాగాలలో సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది.

6 జిల్లాల్లో అతి భారీ వర్షాలు

6 జిల్లాల్లో అతి భారీ వర్షాలు

రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో అక్టోబర్ 9వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఇవాళ 6 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఉరుములు మెరుపులతో

ఉరుములు మెరుపులతో

వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతవరణ శాఖ వివరించింది. నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు అవకాశం ఉందని తెలిపింది.

తేలికపాటి వర్షాలు

తేలికపాటి వర్షాలు

శనివారం నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్ వానలు పడతాయని పేర్కొంది. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీచేసింది. ఆది, సోమ, మంగళవారాల్లోనూ కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.

ఏపీలోనూ వాన

ఏపీలోనూ వాన

వర్షాలు కురిస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆరెంజ్, యెల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లా అధికారులను అప్రమత్తం చేసింది. అనవసరంగా బయట తిరగొద్దని సూచించింది. అటు ఏపీలోనూ శుక్ర, శని వారాల్లో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది.

English summary
Heavy rains are likely to occur in many districts of Telangana on Friday and Saturday. Hyderabad Meteorological Department has explained that heavy to very heavy rains will occur in Vikarabad, Mahbubnagar, Nagar Kurnool, Vanaparthi, Narayanapet and Jogulamba Gadwala districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X