హైదరాబాద్‌ను వీడని వానలు: మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు

హైదరాబాద్: భాగ్యనగరాన్ని వానలు వీడటం లేదు. గత కొద్ది రోజులుగా ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మధ్యాహ్నం వరకు పొడిగా ఉండే వాతావరణం.. ఆ తర్వాత ఒక్కసారిగా నల్లమబ్బులు కమ్ముకుని కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు.

ఉపరితల ద్రోణి ప్రభావంతో నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి ఉన్నట్టుండి భారీ వర్షాలు హైదరాబాద్ నగరాన్ని ముంచేశాయి. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా వరద చేరడంతో డ్రైనేజీలు, మ్యాన్‌హోళ్లు, నాలాలు పొంగిపొర్లాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

heavy rains in Hyderabad for next two days

షేక్‌పేట్, నిజాంపేట్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మియాపూర్, ఎస్‌ఆర్ నగర్, మాదాపూర్, జీడిమెట్ల, బంజారాహిల్స్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, ఉప్పల్, తార్నాక, రాజేంద్రనగర్‌లో కుండపోత వర్షం పడింది. షేక్‌పేటలో అత్యధికంగా 11.78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఆ తర్వాత మాదాపూర్‌లో 10.9 సెంటీమీటర్లు, జూబ్లీహిల్స్‌లో 10.5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముంపు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. కాగా, మరో రెండు రోజులపాటు హైదరాబాద్ నగరంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు, ఏపీలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+