తెలంగాణలో మరో మూడురోజుల పాటు భారీ వర్షాలు..
తెలంగాణలో మరో మూడురోజుల పాటు వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టిన సంగతి తెలిసిందే. ఇక, నేటి నుంచి మూడురోజుల పాటు ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరిస్తుంది. నిన్న దక్షిణ తెలంగాణ నుండి ఆగ్నేయ అరేబియన్ సముద్రం, కేరళ తీరం వద్ద కేంద్రీకృతమై నేడు తెలంగాణకి దూరంగా కదిలిపోనుంది. ఈ ప్రభావం కారణంగా రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానంగా దక్షిణ, ఆగ్నేయ దిశల నుండి వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
నేడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, భూపాలపల్లి, నిజామాబాద్, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ములుగు, జనగామ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, కొత్తగూడెం, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వర్షాలతోపాటు పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు.

ఈ ప్రాంతాల్లో భారీ వర్షం..
నిన్న రాత్రి నగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అమీర్ పేట, సనత్ నగర్, ముషీరాబాద్, జీడీమెట్ల, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, నాంపల్లి, కోఠి, తిరుమలగిరి, వనస్థలిపురం, గండిమైసమ్మ, మలక్ పేట ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ప్యాట్నీ, బేగంపేట, చిలకలగూడ, బాచుపల్లి, ప్రగతి నగర్, ఖైరతాబాద్, మారేడ్‌పల్లి, మేడ్చల్, దుండిగల్, చైతన్యపురి, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.












Click it and Unblock the Notifications