తెలంగాణలో భారీ వర్షాలకు 9 మంది మృతి: పలువురు గల్లంతు
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగి పొర్లడంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రంలో 9 మంది మృతి చెందినట్లు రెవెన్యూ శాఖ మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వరంగల్‌లో ఐదుగురు మృతి చెందగా, సూర్యాపేట జిల్లాలో ఇద్దరు, ఖమ్మం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. వరదల్లో పలువురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు అత్యధికంగా ఐదుగురు మృతి చెందారు. సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రీ కుమార్తె వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఆయన కుమార్తె అశ్విని వ్యవసాయ శాస్త్రవేత్తగా రాయ్‌పూర్‌లో విధులు నిర్వహిస్తోంది. తండ్రితో కలిసి కారులో హైదరాబాద్ బయలుదేరగా మార్గమధ్యలో వరదలో చిక్కుకుపోయి కొట్టుకుపోయారు.

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో మందపల్లికి చెందిన భిక్షాటన చేసుకొనే వృద్ధురాలు మరణించింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పశువులను మేతకు తీసుకెళ్లి వస్తుండగా వరద ప్రవాహానికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. పరకాల గ్రామానికి చెందిన మరో వ్యక్తి చెరువులో చేపల వేటకు వెళ్లి గల్లంతై చనిపోయారు.
#HeavyFloods in Akeru stream of Chinnagudur, #Mahabubabad
— Pakka Telugu Media (@pakkatelugunewz) September 1, 2024
Man, daughter on their way to #Hyderabad Airport on a car washed away, woman's body found#TelanganaRain #TelanganaRains #HyderabadRains #Prabhas #TheyCallHimOG #AlluArjun #Matta #Formula4Chennai #Suriya #HeavyRains pic.twitter.com/P77RHUgAnl
మరోవైపు, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలో పాలేరు వాగులో దంపతులు వరదనీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. పాలేరు అలుగు సమీపంలో ఉన్న సిమెంటు ఇటుకల తయారీ కర్మాగారంలో ఓ కుటుంబం నివసిస్తోంది. పాలేరు జలాశయానికి ఆదివారం తెల్లవారుజాము నుంచి వరద పోటెత్తడంతో షేక్ యాకుబ్, భార్య సైదాబి, కుమారుడు షరీఫ్ వరదల్లో చిక్కుకుపోయారు. వరద ఉద్ధృతి పెరగడంతో ప్రవాహంలో గల్లంతయ్యారు. అయితే, కొట్టుకుపోతున్న షరీఫ్‌ను స్థానికులు, పోలీసులు కాపాడారు.
A person swept away and stranded in the Naganool Vagu stream was courageously rescued by our dedicated police officers. Hats off to their bravery and quick action! #Hyderabad #Telangana #Andhra #Rain #NagarKurnoolpic.twitter.com/1ikkY3t40a
— The Munsif Daily (@munsifdigital) September 1, 2024
సూర్యాపేటజిల్లా కోదాడలో వరద నీటిలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. రాత్రి భారీ వర్షం కారణంగా కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. కొట్టుకుపోయిన ఓ కారులో రవి అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. శ్రీనివాస నగర్‌కు చెందిన టీచర్ వెంకటేశ్వర్లు శనివారం రాత్రి బైకుపై ఇంటికి వెళ్తూ వరదలో గల్లంతయ్యారు. ఆయన మృతదేహం ఆదివారం వరద నీటిలో లభ్యమైంది.
#WATCH | Telangana: Waterlogging witnessed in Warangal city following heavy rain in the region. pic.twitter.com/Y2qRYBKjLC
— ANI (@ANI) September 1, 2024
ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది కోదాడలో ముంపు బాధితులను బోట్ల సాయంతో కాపాడారు. మహబూబాబాద్ జిల్లా సీతారాం తండాలో వరద బాధితులను అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. పలు ప్రాంతాల్లో వరదలో చిక్కున్న 250 మందిని అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది కాపాడారు.
పెద్దపల్లి జిల్లాలో మల్యాల వాగులో ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారు. కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల వద్ద వాగు దాటుతూ వారు గల్లంతైయ్యారు. వాగులో కొట్టుకుపోతూ చెట్టుని ఒక యువకుడు పట్టుకున్నాడు. ఆ యువకుడిని కాపాడేందుకు స్థానికులు యత్నించారు. గల్లంతైన మరో యువకుడి కోసం రెస్క్యూ టీం గాలిస్తోంది. వాగులో గల్లంతైన వ్యక్తి మీర్జంపేట పంచాయతీ బిల్ కలెక్టర్‌గా గుర్తించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications