తెలంగాణాలో కుండపోత వర్షాలు.. తొమ్మిది జిల్లాలకు రెడ్ అలెర్ట్; మరో మూడురోజులూ ఇదే పరిస్థితి!!

రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రాజధాని హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కృష్ణా, గోదావరి నదులకు భారీగా ఇన్ ఫ్లో వస్తున్నందున ప్రాజెక్ట్ ల విషయంలో జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

తెలంగాణాలో కుండపోత వానలు.. అత్యధిక వర్షపాతం అక్కడే

తెలంగాణాలో కుండపోత వానలు.. అత్యధిక వర్షపాతం అక్కడే

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తుండగా మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 24 గంటల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ వర్షం కురిసినట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కామారెడ్డి, నల్గొండ జిల్లాలలో భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు అత్యధికంగా నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కొండూరులో 186 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు గా తెలుస్తోంది. నిర్మల్ జిల్లా అబ్దుల్లాపూర్ లో 178 మిల్లీ మీటర్లు, నిజామాబాద్ జిల్లా కొండపల్లిలో 158 మిల్లీ మీటర్లు, సూర్యాపేట జిల్లా మునగాల లో 156 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.

వరంగల్, హన్మకొండ లతో పాటు 9 జిల్లాలలో రెడ్ అలెర్ట్

వరంగల్, హన్మకొండ లతో పాటు 9 జిల్లాలలో రెడ్ అలెర్ట్

ఇక రాబోయే రెండు రోజులు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తం తొమ్మిది జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక జిల్లాల వివరాల్లోకి వెళితే వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు.

ఇదే సమయంలో హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేశారు. మిగతా జిల్లాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా చెప్పారు.

ప్రాజెక్ట్ లకు భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు

ప్రాజెక్ట్ లకు భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు

ఇక తాజాగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండి మత్తడి పోస్తున్నాయి. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుంది. తెలంగాణ, ఎగువ నదీ తీర రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిస్తే ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఒకట్రెండు రోజులు కొనసాగితే వరుసగా ఎనిమిదో ఏడాది కూడా తెలంగాణ నీటి ఎద్దడి నుంచి బయటపడుతుందని అధికారులు చెబుతున్నారు.

నీటిని దిగువకు వదులుతూ చర్యలు తీసుకుంటున్న అధికారులు

నీటిని దిగువకు వదులుతూ చర్యలు తీసుకుంటున్న అధికారులు

గురువారం నుంచి గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రభావంతో అన్ని ప్రాజెక్టులకు నీరు పోటెత్తడంతో, వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అన్ని ప్రాజెక్టుల వద్ద ప్రత్యేక నీటిపారుదల బృందాలను నియమించారు. ఎప్పటికప్పుడు నీటి సామర్ధ్యాన్ని, వస్తున్న ఇన్ ఫ్లో ను బట్టి అధికారులు నీటిని విడుదల చేస్తూ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, భారీ వర్షాల కారణంగా మహబూబ్‌నగర్, సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండ జిల్లాల్లో కొన్ని చోట్ల నష్టం వాటిల్లింది.

వరదలతో నష్టం ... పలు ప్రాంతాలకు రాకపోకలు బంద్

వరదలతో నష్టం ... పలు ప్రాంతాలకు రాకపోకలు బంద్

నిన్నటికి నిన్న మహబూబ్‌నగర్ జిల్లాలో 25 మంది పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సు రైల్వే అండర్ బ్రిడ్జి కింద వరదనీటిలో చిక్కుకుంది. బస్సు రామచంద్రాపురం నుంచి సూగూరు తండాకు వెళ్తోంది. స్థానికులు వరద నీటిలోంచి బస్సును బయటకు తీసి విద్యార్థులను రక్షించారు. నల్గొండ జిల్లాలో వర్షం కారణంగా గోడ కూలి ఇద్దరు తల్లీకూతుళ్లు మృతి చెందారు. వర్ష ప్రభావంతో అనేక గిరిజన గ్రామాలకు ఇప్పటికే వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+