ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు
హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ పేర్కొంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ఆయా జిల్లాల కలెక్టర్‌లను అప్రమత్తం చేశారు. కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి, మానిటర్ చేస్తూ ఉండాలని ఆదేశించారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.

కాగా, వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని.. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలను ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం చురుగ్గా ఉందని పేర్కొంది.
ఈ క్రమంలో రాగల రెండుమూడురోజుల్లో రోజుల పాటు పశ్చిమ వాయవ్య దిశలో ఉత్తర ఒడిశా-ఉత్తర ఛత్తీస్ గఢ్ వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే రెండు రోజుల పాటు ఉతర తెలంగాణల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వివరించింది.
శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్క భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది.
శనివారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే భారీ వర్షాలు, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
కాగా, శుక్రవారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసఫ్ గూడ, రహమతి నగర్, మోతి నగర్, బోరబండలో మోస్తరు వర్షం కురిసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.












Click it and Unblock the Notifications