భారీ వర్షాలతో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు రద్దయ్యాయి. హసన్‌పర్తి- కాజీపేట మార్గంలో రైల్వే ట్రాక్‌పై భారీగా వర్షపు నీరు నిలవడంతో.. మూడు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మొత్తం 9 రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది.

సిర్పూర్ కాగజ్‌నగర్- సికింద్రాబాద్ (17012), సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్(17233), సిర్పూర్ కాగజ్‌నగర్- సికింద్రాబాద్(17234) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. మరోవైపు, తిరుపతి-కరీంనగర్(12761), కరీంనగర్-తిరుపతి (12762), సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్(12757), సిర్పూర్ కాగజ్‌నగర్ - సికింద్రాబాద్ (12758) రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది.

heavyrains-sometrainscancelled

కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాజీపేట రైల్వే స్టేషన్, వరంగల్ బట్టల బజార్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. హనుమకొండ-వరంగల్ రహదారి బ్రిడ్జిపైనుంచి వరదనీరు ప్రవహిస్తోంది. వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి కింద వరదనీరు నిలిచింది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి జలదిగ్భంలోనే ఉంది. కాగా, మరో రెండు రోజులపాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది జిల్లా వాతావరణ శాఖ. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

మరోవైపు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పూర్తిగా నీటమునిగిన మోరంచపల్లి గ్రామంలో.. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సాధారణ హెలికాప్టర్లు ఈ వాతావరణ పరిస్థితుల్లో సంచరించడం కష్టమయ్యే అవకాశం ఉండటంతో ఆర్మీ హెలికాప్టర్ల కోసం సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారులతో సీఎస్ శాంతి కుమారు మాట్లాడారు. అనంతరం రెండు హెలికాప్టర్లను మోరంచపల్లికి హెలికాప్టర్లను పంపుతున్నట్లు తెలిపారు. భద్రకాళి ఆలయం వద్ద అయ్యప్పస్వామి గుడిలోకి వరదనీరు చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+