హైదరాబాద్‌కు కొత్త శోభ, రూ.3500కు ఆకాశం నుంచి చూడొచ్చు (పిక్చర్స్)

హైదరాబాద్: భాగ్యనగరాన్ని పది నిమిషాల్లో హెలికాప్టర్‌లో చూడవచ్చు. రూ.3500తో ఆకాశ వీధి నుంచి హైదరాబాద్ చూసే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కల్పిస్తోంది. మంగళవారం నాడు దీనిని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు.

నెక్లెస్ రోడ్డులో హెలి టూరిజం ఇన్ హైదరాబాద్‌ను కెటిఆర్ ప్రారంభించారు. హెలికాప్టర్లో ప్రయాణిస్తూ పది నుంచి పదిహేను నిమిషాల వ్యవధిలో నగరంలోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు తదితరాలను తిలకించే అవకాశాన్ని కల్పించారు.

హెలికాప్టర్‌లో నలుగురు ప్రయాణించే అవకాశం ఉంది. పర్యాటక శాఖ - ఇండివెల్ ఏవియేషన్ సంయుక్తంగా హెలి టూరిజం ప్రాజెక్టును చేపట్టాయి. నెక్లెస్ రోడ్డు నుంచి ప్రారంభమయ్యే హెలికాప్టర్ ప్రయాణం.. తిరిగి నెక్లెస్ రోడ్డు వద్దకు చేరుకుంటుంది.

సాగర్, రవీంద్ర భారతి, నాంపల్లి, చార్మినార్, మెహిదీపట్నం, గోల్కొండ కోట, శంషాబాద్ విమానాశ్రయం తదితరాలు చూపించనున్నారు. జాయ్ రైడ్ పేరుతో నెల రోజుల పాటు భాగ్యనగర వాసులకు ఈ అవకాశం కల్పిస్తున్నారు. హైదరాబాదును హెలికాప్టర్ ద్వారా చూడటం అందరూ గొప్ప అనుభూతిగా భావిస్తారు.

హెలి టూరిజం ప్రారంభించిన సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్ ప్రజలంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. హెలికాప్టర్ సాగర్ వద్దే ల్యాండ్ అయి, ఇక్కడే టేకాఫ్ అయ్యే విధంగా ఉందని మంత్రి చెప్పారు.

హెలీ టూరిజం

హెలీ టూరిజం

భాగ్యనగరాన్ని ఇక నుంచి ఆకాశం నుంచి చూడొచ్చు. హెలికాప్టర్ ద్వారాచక్కర్లు కొట్టవచ్చు. గోల్కొండ వంటి చారిత్రక కట్టడాలను, సాగర్ వంటి జలదృశ్యాలను హెలికాప్టర్‌లో చూడవచ్చు.

హెలీ టూరిజం

హెలీ టూరిజం

ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెలీ టూరిజాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. హెలికాప్టర్లో ఎవరైనా ప్రయాణించి నగరాన్ని ఆకాశం నుంచి చూడవచ్చు.

హెలీ టూరిజం

హెలీ టూరిజం

మంగళవారం నెక్లెస్ రోడ్డులో హెలీ టూర్ సౌకర్యాన్ని మంత్రి కెటి రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హెలీటూరిజంతో నగర పర్యాటకానికి కొత్త శోభ రానున్నదన్నారు.

హెలీ టూరిజం

హెలీ టూరిజం

విమానయానాన్ని సంపన్నులకే కాకుండా సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చేందుకే ప్రభుత్వం హెలీ టూర్ ప్రవేశపెట్టిందని కెటిఆర్ చెప్పారు.

హెలీ టూరిజం

హెలీ టూరిజం

ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రముఖ నగరాల్లో ఈ పర్యటనకు మంచి ఆదరణ లభిస్తున్నదన్నారు. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ కూడా ఆ స్థాయిని ఇపుడు అందిపుచ్చుకున్నదన్నారు.

హెలీ టూరిజం

హెలీ టూరిజం

పర్యాటకులను విశేషంగా ఆకర్షించేలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. హెలీ టూరిజంతో పాటు నగరంలో ఇతర పర్యాటక ప్రాంతాలను సైతం అభివృద్ధి చేస్తామని కెటిఆర్ అన్నారు.

హెలీ టూరిజం

హెలీ టూరిజం

ఔటర్‌రింగ్ రోడ్డు,క హుస్సేన్‌సాగర్, మూసీనది అభివృద్ధి కార్యక్రమాలను మున్సిపల్ శాఖ చేపడుతున్నదన్నారు. త్వరలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళనను పూర్తి చేస్తామని, ఇక్కడున్న సంజీవయ్య పార్క్‌ను మరింత అందంగా తీర్చిదిద్దుతామని కెటిఆర్ అన్నారు.

హెలీ టూరిజం

హెలీ టూరిజం

హైదరాబాద్ ప్రజలకు అహ్లాదకరమైన అనుభవాన్ని అందించేందుకు ఉద్దేశించిన హెలీ టూర్‌ను విశేషంగా ఆదరించాలని కెటిఆర్ కోరారు.

హెలీ టూరిజం

హెలీ టూరిజం

పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ మాట్లాడుతూ... నగరంతో పాటు లక్నవరం, మేడారం వంటి పర్యాటక ప్రాంతాలకు సైతం హెలీటూర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

 హెలీ టూరిజం

హెలీ టూరిజం

గర మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ... పర్యాటక శాఖ హెలీటూర్‌ను ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం నవీనీకరణ వైపు అడుగులేస్తున్నదని, హెలీటూర్ నగర అభివృద్ధిలో విప్లవాత్మక మార్పుగా ఉంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+