అందరు ఐఏఎస్ లకు భిన్నంగా స్మితా సబర్వాల్ కోసం హెలికాఫ్టర్: ఆకునూరి మురళి ఫైర్!!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం స్మిత సబర్వాల్ అంశం. స్మిత సబర్వాల్ పేరు చెప్తే తెలంగాణ అధికార వర్గాల్లోనే కాదు, రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజలలోను ఎక్కడలేని ఆసక్తి కలుగుతుంది. సీఎం ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తించిన ఆమె కెసిఆర్ మెప్పు పొందిన అధికారిణిగా కీలక బాధ్యతలను నిర్వర్తించారు.
ఇక స్మిత సబర్వాల్ కు కేసిఆర్ కానీ, కేటీఆర్ కానీ ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్మిత సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని చూస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని, స్మిత సబర్వాల్ ఆ వార్తలను ఖండించినప్పటికీ, ఆమె ప్రయత్నం చేసే ఉంటారు అన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుంది.

కొత్త సర్కారు కొలువుదీరినప్పటినుంచి స్మిత సబర్వాల్ ఎక్కడ కనిపించకపోవడం ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమైన అధికారులంతా మర్యాదపూర్వకంగా ఆయనను కలిసినప్పటికి స్మితా సబర్వాల్ మాత్రం ఆయనను కలవలేదు. ఆమె కేసీఆర్ పాలనా సమయంలో ప్రభుత్వ పాలనకు కితాబిస్తూ అనేక పోస్టులు పెట్టారు.
ఇక ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో 23 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నానని, కొత్త ఛాలెంజ్ లకు తను ఎప్పుడు సిద్ధమేనంటూ స్మిత సబర్వాల్ పోస్ట్ పెట్టడం, కేంద్ర సర్వీసులలో ఉన్న ఆమ్రపాలి తెలంగాణ రాష్ట్రానికి రావాలని ప్రయత్నాలు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి స్మిత సబర్వాల్ ను టార్గెట్ చేశారు.
అప్పటి ప్రభుత్వం లో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వానికి వెళ్లి ( అక్కడి caste కనెక్షన్స్ network వాడుకొని ) ఇక్కడి తప్పులను తప్పించుకోడం fashion అయ్యింది కొంత మంది IAS ఆఫీసర్లకు అంటూ ఆయన స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం వీళ్ళను కేంద్రానికి పంపకుండా చర్యలు తీసుకోవాలి అన్నారు.
ఏం తప్పులు చెయ్యకపోతే ఎందుకు భుజాలు తడుముకోడం అంటూ ప్రశ్నించిన ఆకునూరి మురళి దేశం మొత్తం లో హెలికాఫ్టర్ లో వెళ్లి పనులను inspection చేసే ఏకైక IAS ఆఫీసర్ ఈమెగారు మాత్రమే అంటూ స్మిత సబర్వాల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications