వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హత్యానేరంలో కోడి అరెస్ట్ ... పోలీస్ స్టేషన్ లో ఏ1 కోడి.. మ్యాటర్ ఏంటంటే

|
Google Oneindia TeluguNews

ఒక హత్య నేరం మీద పోలీసులు ఒక కోడిని అరెస్టు చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మృతికి కారణమైన కోడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఏ1 గా కోడి రాజాను నమోదు చేసి, పోలీస్ స్టేషన్లో కట్టేశారు. కాసేపు సెల్ లో , కాసేపు చెట్టు కింద హత్య నేరం మోపబడిన కోడిని కట్టేసి దాని కోసం నానా చావు చస్తున్నారు.

 కోడి కాలికి అమర్చిన కత్తి పొట్టలో గుచ్చుకోవడంతో సతీష్ మృతి

కోడి కాలికి అమర్చిన కత్తి పొట్టలో గుచ్చుకోవడంతో సతీష్ మృతి

ఇక అసలు విషయానికి వస్తే జగిత్యాల జిల్లా వెలగటూర్ మండలం కొండాపూర్ కు చెందిన తనుగుల సతీష్ అనే యువకుడు ఓ పందెంకోడి కాలికి కట్టిన కత్తి గుచ్చుకుని చనిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కోడిని అరెస్ట్ చేశారు. తొత్తునూరులో తన స్నేహితులతో కలిసి కోడిపందాలు నిర్వహించడానికి వెళ్ళిన సతీష్ కోడి కాలికి అమర్చిన కత్తి పొట్టలో గుచ్చుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో సతీష్ మృతి చెందాడు.

పోలీస్ స్టేషన్ లో కోడి .. ఎఫ్ఐఆర్లో ఏ1 గా నమోదు

పోలీస్ స్టేషన్ లో కోడి .. ఎఫ్ఐఆర్లో ఏ1 గా నమోదు

ఇక దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు యువకుడు మృతికి కారణమైన కోడిని అరెస్ట్ చేశారు. కోడి పందాలు ఆడిన వారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. అయితే సతీష్ మరణానికి ప్రధానంగా కోడినే కారణమని ఎఫ్ఐఆర్లో ఏ1 గా కోడిని నమోదు చేశారు. త్వరలో కోర్టులో కోడిని ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తుంది. అప్పటివరకు కోడిని కంటికి రెప్పలా చూసుకోవడం కోసం, దానికి ఆహారం, నీటి వసతి కల్పించి పోలీసులు నానా అవస్థలు పడుతున్నారు.

విచిత్రమైన కేసుగా చర్చ .. కోడికి కత్తులు కట్టింది ఎవరో ?

విచిత్రమైన కేసుగా చర్చ .. కోడికి కత్తులు కట్టింది ఎవరో ?

ఇక పోలీస్ స్టేషన్ లో ఉన్న కోడి తెగ తిన్న కోడి ఇల్లెక్కి కూసిన చందంగా పోలీస్ స్టేషన్లో తన కూతలతో హోరెత్తి స్తోంది. నానా హంగామా చేస్తోంది. అయితే ఈ విచిత్రమైన కేసు విన్నవారంతా కోడి పై కేసు పెట్టడం ఏంటి అని నవ్వుకుంటున్నారు. కోడికి కత్తులు కట్టిన వారెవరో అన్న చర్చ జరుగుతుంది . కోడిని పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మనుషులు మీదనే కాదు, పక్షుల మీద, జంతువుల మీద కూడా హత్యా నేరాల కింద కేసులు పెట్టొచ్చని ఈ వార్త విన్న వాళ్లంతా తెగ చర్చించుకుంటున్నారు.

English summary
The incident took place in the state of Telangana when the police arrested a hen on a murder charge. Hen, was arrested by the police for causing the death of a man, was registered as A1 and tied up at the police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X