ఖమ్మంలో కటకటాలపాలైన కోడి.. పట్టుకొచ్చి లోపలేసేశారు

Subscribe to Oneindia Telugu

రఘునాథపాలెం : పెంపుడు జంతువులన్నాక యజమానుల మాట వినడం పరిపాటి. లేదంటే.. ఆ పూటకు పస్తులుండాల్సిందే. కాబట్టి యజమాని డైరెక్షన్ లో ఎలా ఆడిస్తే అలా ఆడాల్సిందే. అయితే సదరు యజమానులు వాటిని తప్పుడు పనుల కోసం ఉపయోగిస్తే.. యజమానులంటే మనుషులు కాబట్టి, మాటలతోనే, మామూళ్లతోనో తప్పించుకుంటారు. కానీ మూగ జీవాలకు నో ఛాన్స్. దీంతో వాటినీ లోపలేయడానికి వెనుకాడడం లేదు పోలీస్ బాసులు.

Hen was jailed for participating in race

తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ కోడి పుంజును లాకప్ లో వేసేశారు అక్కడి పోలీసులు. ప్రస్తుతం ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ లో బంధీగా ఉన్న ఆ కోడి పుంజు చేసిన నేరమేంటంటే.. సదరు యజమాని గారి డైరెక్షన్ లో కోడి పందెల్లోకి దిగడమే. ఆదివారం నాడు ఖమ్మం పట్టణ శివారులోని ఓ కాలేజీ వెనుక కోడి పందాలు ఆడుతున్నట్టుగా సమాచారం అందుకున్నారు పోలీసులు.

అయితే పోలీసుల రాకను గమనించిన పందెం రాయుళ్లంతా అక్కడి నుంచి పరారవగా, అక్కడే వదిలేసి పోయిన కోడిపుంజును స్టేషన్ కు తీసుకొచ్చి లాకప్ లో వేసేశారు పోలీసులు. విషయం కాస్త మీడియాకు తెలియడంతో స్టేషన్ కు వెళ్లి కోడిపుంజును క్లిక్ మనిపించే ప్రయత్నం చేశారు కొంతమంది పత్రికా ఫోటోగ్రాఫర్లు. దీంతో కోడిపుంజును లాకప్ లో నుంచి బయటకు తీసుకొచ్చి కట్టేశారు. మరి మనుషులకైతే పలానా శిక్షలంటూ ఉన్నాయి గానీ ఈ కోడిపుంజుకు ఇప్పుడేం శిక్ష విధిస్తారన్నదే అందరిలోను తలెత్తుతోన్న ప్రశ్న.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Its an interesting news happened in khammam. The Khammam urban Police was arrested a hen for participating in race.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి