వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే... 'వీఆర్వో వ్యవస్థ' రద్దు,కొత్త రెవెన్యూ బిల్లుకు ఆమోదం...

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.సుమారు రెండు గంటలకు పైగా జరిగిన సమావేశంలో పలు బిల్లులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇందులో కొత్త రెవెన్యూతో బిల్లుతో పాటు వివిధ సవరణ బిల్లులు ఉన్నాయి. అసెంబ్లీ రెవెన్యూ బిల్లును బుధవారం(సెప్టెంబర్ 9) అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. 17 కులాలను బీసీ జాబితాలో చేర్చాలని బీసీ కమిషన్ చేసిన సిఫారసులకు కూడా ఆమోదం తెలిపింది.

కేబినెట్ నిర్ణయాలివే...

కేబినెట్ నిర్ణయాలివే...

కొత్త రెవెన్యూ బిల్లు,వీఆర్వో వ్యవస్థ రద్దు,టీఎస్ బీపాస్,తెలంగాణ మున్సిపాలిటీ చట్టం-2019 సవరణ,తెలంగాణ జీఎస్టీ చట్టం-2017,తెలంగాణ సివిల్ కోర్టు చట్టం-1972 బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ ఆర్డినెన్స్-2020,తెలంగాణ డిజాస్టర్&పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్-2020,తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ&బడ్జెట్ మేనేజ్‌మెంట్ బిల్లు-2020లకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఆయుష్ కాలేజీల్లో అధ్యాపకుల వయోపరిమితి పెంపు...

ఆయుష్ కాలేజీల్లో అధ్యాపకుల వయోపరిమితి పెంపు...

కొత్త సచివాలయ నిర్మాణం, పాత సచివాలయం కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించి పరిపాలనా అనుమతులను కేబినెట్ ఆమోదించింది. కొత్తగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫీస్ కాంప్లెక్సుల నిర్మాణానికి అవసరమయ్యే నిధుల కోసం స‌వ‌రించిన ప‌రిపాల‌నా అనుమ‌తుల‌కు ఆమోద ముద్ర వేసింది. ఆయుష్ కాలేజీల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్స్‌కు కూడా ఆమోద ముద్ర వేసింది. బీసీ జాబితాలో 17 కులాలను చేర్చాలంటూ బీసీ కమిషన్ ఇచ్చిన సిఫారసులకు ఆమోదం తెలిపింది.

సవరణ బిల్లులు...

సవరణ బిల్లులు...

తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్ట్ -1956 సవరణ బిల్లు, పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్‌మెంట్-గ్రామ పంచాయత్స్-ట్రాన్స్‌ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్ట్-2018 సవరణ బిల్లు, ది తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020, ద తెలంగాణ సివిల్ కోర్ట్స్ యాక్ట్ -1972 సవరణ బిల్లులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

Recommended Video

MLA Seethakka Exclusive Interview అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ఫై MLA సీతక్క
కాళోజీ అవార్డు ఎవరికంటే...

కాళోజీ అవార్డు ఎవరికంటే...

ఇక ఈ ఏడాది ప్రజాకవి కాళోజీ నారాయణరావు అవార్డుకు శ్రీరామా చంద్రమౌళి ఎంపికకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. రామా చంద్రమౌళి వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇప్పటివరకూ 20 నవలలు,250 కి పైగా కథలు,9 సంపుటాల కవిత్వం వెలువరించారు. గతంలో ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డును అందుకున్నారు.

English summary
In a latest development,Telangana cabinet took key decisions including abolition of VRO system.The cabinet accepted few new bills and few amendments in latest cabinet meeting at Pragathi Bhavan,in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X