అలా రాస్తారా?: జగన్ 'సాక్షి'కి చంద్రబాబు హెరిటేజ్ లీగల్ నోటీసులు
సాక్షి మీడియాకు హెరిటేజ్ ఫుడ్స్ లీగల్ నోటీసులు పంపించింది. ఎర్ర చందనం అక్రమ రవాణాపై తప్పుడు కథనం ప్రసారం చేశారని నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్: సాక్షి మీడియాకు హెరిటేజ్ ఫుడ్స్ లీగల్ నోటీసులు పంపించినట్లుగా తెలుస్తోంది. ఎర్ర చందనం అక్రమ రవాణాపై తప్పుడు కథనం ప్రసారం చేశారని నోటీసులు జారీ చేసింది.
ఈ విషయాన్ని హెరిటేజ్ ఫుడ్స్ ప్రతినిధులు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు హెరిటేజ్ వాహనాలు ఉపయోగించినట్లు సాక్షి మీడియాలో కథనం ప్రసారం చేశారని ఆ సంస్థ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన వ్యానులో ఎర్ర చందనం దుంగలు తరలించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అది ఆ సంస్థ వ్యాన్ కాదని తేల్చారు.












Click it and Unblock the Notifications