మిషన్ కాకతీయకు హెటిరో విరాళం 2కోట్లు(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి ప్రముఖ ఔషధ తయారీ సంస్థ హెటిరో భారీ విరాళం అందించింది. ఖమ్మం జిల్లాలో చేపట్టే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం కింద రూ. 2.5 కోట్లు అందించింది.
హెటిరో సంస్థ సీఎండీ పార్థసారథిరెడ్డి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కలుసుకుని ఈ మేరకు చెక్కును అందజేశారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం అంత్యంత ప్రాధాన్యమైందని భావిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. తమ స్వగ్రామం ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో లింగగూడెం, చంద్రమ్మ చెరువులను దత్తత తీసుకుని, వీటి పునరుద్ధరణ కోసం ఆర్థిక సహాయం అందించినట్టు వెల్లడించారు.
తన స్వగ్రామానికి ఈ రకంగా సేవ చేసుకునే భాగ్యం మిషన్ కాకతీయ ద్వారా లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. కాగా, పార్థసారథిరెడ్డి, ఇతర డైరెక్టర్లను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. హెటిరో సంస్థ చూపిన చొరవ అనేక మందికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెటిరో సంస్థ డైరెక్టర్లు రత్నాకర్‌రెడ్డి, కేవీ భాస్కర్‌రెడ్డి, జీఎం సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హెటిరో విరాళం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి ప్రముఖ ఔషధ తయారీ సంస్థ హెటిరో భారీ విరాళం అందించింది.

హెటిరో విరాళం
ఖమ్మం జిల్లాలో చేపట్టే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం కింద రూ. 2.5 కోట్లు అందించింది.

హెటిరో విరాళం
హెటిరో సంస్థ సీఎండీ పార్థసారథిరెడ్డి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కలుసుకుని ఈ మేరకు చెక్కును అందజేశారు.

హెటిరో విరాళం
బంగారు తెలంగాణ నిర్మాణంలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం అంత్యంత ప్రాధాన్యమైందని భావిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.












Click it and Unblock the Notifications