వెనకబడిన జిల్లాలో హైటెక్‌ వ్యభిచారం: నివాస గృహాలే కేంద్రాలు!

అభివృద్ధిలో వెనకబడిన ఆదిలాబాద్ జిల్లాలో హైటెక్ వ్యభిచార కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి.

ఆదిలాబాద్: అభివృద్ధిలో వెనకబడిన ఆదిలాబాద్ జిల్లాలో హైటెక్ వ్యభిచార కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా నివాస గృహాల్లోనే ఈ కార్యకలాపాలు నిర్వహిస్తుండటం గమనార్హం. సెల్ ఫోన్లు, వాట్సప్ ద్వారా తమ వ్యభిచార కార్యకలాపాలను నిర్వాహకులు సులభతరం చేసుకుంటుున్నారు. అయితే, ఈ వ్యభిచారానికి సంబంధించిన వ్యవహారాలు ఇంకా పోలీసులకు చేరకపోవడం గమనార్హం.

ఆదిలాబాద్‌ జిల్లాకేంద్రంలోనే ఈ హైటెక్‌ వ్యభిచారం విస్తృతంగా జరుగుతోంది. పేదరికంతో వ్యభిచార కూపంలోకి కొందరు దిగుతుంటే.. మరికొందరు మరింత విలాసవంత జీవితం కోసం ఈ వృత్తిలోకి దిగుతున్నారు. వేశ్య వృత్తి చేసేవారు మంచి కుటుంబాలకు చెందిన మహిళలను సైతం ప్రలోభాలకు గురిచేసి ఈ రంగంలోకి దించుతుండటం ఆందోళ కలిగించే అంశం. ప్రతిరోజు జిల్లాకేంద్రంలో వందకుపైగా ఇళ్లలో ఈ దందా నడుస్తోందంటే ఈ వ్యవహారం గురించిన తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

కీలకంగా మారిన వాట్సప్

మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు సైతం ఈ రంగంలోకి దిగడంతో విటులను చూసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తెలిసిన వారుంటే పరువు పోతుందనే భయంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికోసం చాలామంది అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. తొలుత వాట్సాప్‌లో విటుని చిత్రాన్ని పంపించాలని కోరుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకున్నాకే ముందడుగు వేస్తున్నారు.

Hitec sex racket continues in Adilabad.

ఫోన్లలో మాట్లాడే సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతా తెలుసుకున్నాకే సదరు మహిళ ఫొటోను విటునికి పంపించి బేరమాడుకుంటున్నారు. మరికొందరు ఫోన్లో మాట్లాడుకొని తమ ఇళ్ల ముందు నుంచి వెళ్లమనో, లేక ఫలానాచోట కలిస్తే మేం చూసి చెబుతామని చెప్పి సదరు మనిషిని చూశాకే తమకు తెలియని వ్యక్తి అని నిర్ధారణ చేసుకున్నాకే బేరమాడుతుండటం గమనార్హం.

వ్యభిచార కేంద్రాలు నివాస గృహాలు

ఎవరికీ అనుమానం కలగకుండా నివాస గృహాలనే వ్యభిచారానికి అడ్డాలుగా మార్చుకుంటున్నారు నిర్వాహకులు. జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లోని ఇళ్లల్లో ఈ దందా నడిపిస్తున్నారు. బంధువులు వచ్చారనో, ఇతర సామగ్రి కొనుగోలు చేస్తున్నామనో నమ్మేరీతిలో పట్ట పగలే విటులను ఇంటికి పిలిపించుకుంటున్నారు. పైగా అనుమానం రాకుండా ఇంట్లో ప్రధాన ద్వారం మూసి వేయకుండా ఇద్దరు ముగ్గురు మహిళలు మాట్లాడుకుంటున్నట్లు బయట చిత్రీకరిస్తున్నారు.

సొంత ఇళ్లలోనే ఈ వ్యభిచారం నడిపిస్తుండగా.. కొందరు మాత్రం అద్దె ఇళ్లలో సెక్స్ రాకెట్ కొనసాగిస్తున్నారు. ఇళ్ల వినియోగానికి రోజుకు వారు రూ. 1000కిపైగా చెల్లిస్తుండటం గమనార్హం. కొందరు మహిళలు ప్రలోభాలకు గురిచేసి యువతులను సైతం ఈ వ్యాపారంలో దించుతున్నారు. పల్లెల నుంచి వచ్చే కొందరు యువతులకు డబ్బు ఆశ చూపెట్టి ఈ రంగంలోకి దించుతూ వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారు.

పరిచయస్థులైన యువతులకు సైతం ఈ కూపంలోకి లాగుతున్నారు. ఈ వ్యాపారం విచ్చలవిడిగా సాగుతుండటంతో నిర్వాహకులు లక్షల రూపాయలు తమ జేబుల్లో వేసుకుంటున్నారు. ఈ వ్యభిచార కార్యకలాపాలపై స్థానిక పోలీసులు చూడచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

స్థానిక సాధారణ ప్రజలకు ఇబ్బందికరంగా మారిన ఈ పరిస్థితిని మార్చేందుకు పోలీసులు కృషి చేయాలని కోరుతున్నారు. అమాయకులైన యువతులు, మహిళలను ఈ రొంపిలోకి దింపుతున్న నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఆధారాలతో ఫిర్యాదు చేస్తే తాము తప్పక చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+