ధర్మాసనం వైపు దూసుకెళ్లాడు: ఎంపీ వీహెచ్‌పై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) వీసీ అప్పారావును తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.

దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, హెచ్‌సీయూ వీసికి నోటీసులు జారీచేసింది. యూనివర్శిటీలోకి బయటి వ్యక్తులు వెళ్లాల్సిన అవసరం ఏంటని న్యాయస్థానం ప్రశ్నించింది.

High Court fires at V Hanumantha Rao

ఇది ఇలా ఉండగా, విచారణ జరుగుతున్న సమయంలో వి హనుమంతరావు వ్యవహార శైలిపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

వాదనలు కొనసాగుతుండగా వీహెచ్‌ కల్పించుకుని నేరుగా ధర్మాసనంతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. న్యాయమూర్తి ఎంత వారించినా వీహెచ్‌ ప్రవర్తనలో మార్పురాకపోవడంతో పోలీసులను లోనికి పిలిపించారు. ఆయనను బయటికి తీసుకెళ్లారు. కేసు విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+