మియాపూర్ భూములపై తెలంగాణా సీఎం కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్టు
Recommended Video
మియాపూర్ భూములపై తెలంగాణ ప్రభుత్వంకు హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం మియపూర్ భూములపై సేల్ డీడ్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. రద్దు ఉత్తర్వులు నిలుపుదల చేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసులు పరిష్కారం అయ్యే వరకు స్టే విధించింది. మియపూర్ భూములను యధావిధిగా ఉంచాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టులో కేసు పరిష్కారం అయ్యేంత వరకు మియపూర్ భూములను ప్రభుత్వం కొనడం కానీ ప్రైవేటు వ్యక్తులు ఆమ్మ్మడం కానీ చేయకూడదని తెలిపింది. ఎవరైనా చట్టాన్ని దుర్వినియోగం చేస్తే వారిపై కోర్టు సానుభూతి చూపదని స్పష్టం చేసింది.
హైదరాబాద్‌లోని మియాపూర్, బాలానగర్ ప్రాంతాలలో సుప్రీం కోర్టులో పెండిగ్‌లో ఉన్న వేల కోట్ల విలువైన భూములను అధికార అండతో, అక్రమ రిజిస్టేషన్లు చేయించి అమ్ముతున్నారంటూ భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం సేల్ డీడ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై కొందరు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టుకు వెళ్లారు.ఈ విషయాన్ని పరిశీలించిన హైకోర్ట్ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగర శివారులోని మియపూర్ భూములపై రాష్ట్ర ప్రభుత్వం సేల్ డీడ్ రద్దు చేయడాన్ని తప్పు పట్టింది.

రద్దు చేసిన ఉత్తర్వులను వెంటనే నిలిపి వేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చెయ్యటంతో తెలంగాణా ప్రభుత్వానికి చుక్కెదురైంది . సుప్రీంకోర్టులో ఉన్న కేసులు పరిష్కారమయ్యే వరకు స్టే విధించింది. మియపూర్ భూములను యధావిధిగా ఉంచాలని స్టేటస్‌కో ఆర్డర్ కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చింది. చట్టానికి అందరూ సమానమే అని మరొకసారి రుజువు చేసింది తెలంగాణ హైకోర్ట్. తాజాగా వెలువడిన హైకోర్టు ఉత్తర్వులతో ఇప్పుడు మియాపూర్ భూముల విషయంలో యధాతథ స్థితి కొనసాగనుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications