రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 4 వారాల జైలు శిక్ష, జరిమానా
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందనరావుకు నాలుగు వారాల జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు బుధవారంనాడు సంచలన తీర్పు వెలువరించింది. జైలు శిక్ష విధించడంతో పాటు జరిమానా కూడా వేస్తూ కోర్టు తీర్పు చెప్పింది. కోర్టు ధిక్కరణ కింద రఘునందనరావుకు హైకోర్టు శిక్ష వేసింది.
తాము గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. సూరారంలో అక్రమ కట్టడాలు కూల్చివేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయలేదు.

దాంతో హైకోర్టు జిల్లా కలెక్టర్‌కు నాలుగు వారాల జైలు శిక్షతో పాటు 12 వేల రూపాయల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. సూరారం భూముల కేసుకు సంబంధించి కోర్టు తీర్పును స్పెషల్ బెంచ్‌కు అపీల్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ వాదనలు వినిపించేందుకు స్పెషల్ బెంచ్‌ను ఏర్పాటు చేయాలని ప్రధాన న్యాయమూర్తి దిలీప్ కుమార్ భోంస్లేను అడ్వకేట్ జనరల్ కోరారు.












Click it and Unblock the Notifications