విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అగ్రిగోల్డ్ బినామీ లెక్క తీస్తాం: హైకోర్టు, 20లోగా చెప్పండి... ఓటుకు నోటుపై ఎసిబికి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన చెందవద్దని, ఆ సంస్థ అక్రమాస్తులు, బినామీ ఆస్తుల జాబితాను వెలికితీస్తామని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు సోమవారం నాడు పేర్కొంది. అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన బినామీ ఆస్తులను ఆ సంస్థధ యాజమాన్యం అమ్ముకుంటోంది.

బినామీ ఆస్తులను అమ్ముకుంటోందని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషమయై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాధితులకు హైకోర్టులో సోమవారం నాడు ఊరట లభించింది. అగ్రిగోల్డ్ బినామీ ఆస్తులను అమ్మవద్దని హైకోర్టు ఆదేశించింది.

దర్యాఫ్తుకు సంబంధించిన నివేదికను సమర్పించాలని సిఐడిని ఆదేశించింది. సోమవారం లోగా నివేదికను సమర్పించాలని చెప్పింది. అనంతరం దర్యాఫ్తును సోమవారానికి వాయిదా వేసింది.

High Court Serious on Agrigold Management

ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అగ్రిగోల్డ్ అక్రమాస్తులను వెలికి తీస్తామని, బినామీ పేర్లతో ఉన్న జాబితాను వెలికి తీస్తామని పేర్కొంది. అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన చెందవద్దని తెలిపింది. అగ్రిగోల్డ్ బినామీ ఆస్తుల అమ్మకాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది.

బాధితులకు డబ్బు ఇప్పిస్తామని చెప్పింది. అగ్రిగోల్డ్‌కు చెందిన రూ.570 కోట్ల బ్యాంక్ డిపాజిట్లను హైకోర్టు అకౌంటుకు మళ్లించాలని కోర్టు ఆదేశించింది. సీఐడీ సీజ్ చేసిన రెండున్నర కిలోల బంగారం, రూ.7.40 లక్షలను కూడా తమ అకౌంటులో జమ చేయాలని ఆదేశించింది.

రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వంపై అసహనం

రైతుల ఆత్మహత్యల పైన పిటిషన్ సోమవారం నాడు హైకోర్టులో విచారణకు వచ్చింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వచ్చే సోమవారం లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మీడియా ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించింది.

ఓటుకు నోటుపై హైకోర్టులో విచారణ

ఓటుకు నోటు కేసులో జెరూసలేం మత్తయ్య పిటిషన్ పైన సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. మత్తయ్య అభ్యంతరాల పైన ఈ నెల 20వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఎసిబిని ఆదేశించింది. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ఛార్జీషీట్ తమకు ఇవ్వాలని చెప్పింది. అనంతరం కేసును డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.

English summary
High Court Serious on Agrigold Management for selling benami assets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X