• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా తీవ్రతను తగ్గించగలిగామన్న మంత్రులు.!జిహెచ్ఎంసిలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం.!

|

హైదరాబాద్ : నగర ప్రజలకు మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ ఆలీ శుభవార్త వినిపించారు. గ్రేటర్ హైదరాబాద్ లో కోవిడ్ నివారణకై వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నందున పాజిటీవ్ కేసులు తగ్గుముకం పట్టాయని స్పష్టం చేసారు. సోమవారం నగరంలో కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలపై జిహెచ్ఎంసి కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా నగరంలో చేపట్టిన ఇంటింటి ఫీవర్ సర్వే, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, బస్తీ దవఖానాలు, ఏరియా ఆసుపత్రులలో నిర్వహిస్తున్న జ్వర పరిక్షలు, పెద్ద ఎత్తున చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాల వల్ల కరోన నియంత్రణలోనే ఉందని పేర్కొన్నారు.

పలు శాఖల సమన్వయంతో కరోనా కట్టడి చేయగలిగాం.. హర్షం వ్యక్తం చేసిన మంత్రులు తలసాని, మహ్మూద్ అలీ

పలు శాఖల సమన్వయంతో కరోనా కట్టడి చేయగలిగాం.. హర్షం వ్యక్తం చేసిన మంత్రులు తలసాని, మహ్మూద్ అలీ

నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకల లభ్యత, వ్యాక్సినేషన్, రెమిడిసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ అందుబాటు తదితర అంశాలను వెబ్ సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. నగరంలో కోవిడ్ సంబంధిత సమాచారాన్ని ప్రజలకు అందజేయడానికి జిహెచ్ఎంసిలో కోవిడ్ కంట్రోల్ రూం ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని, ఈ కంట్రోల్ రూంలో 040-211 111 11 అనే ఫోన్ నెంబర్ ను ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. మరో నెలరోజుల్లో రుతుపవనాలు ప్రవేశిస్తున్నందున నగరంలోని నాలాల పూడికతీత పనులు ముమ్మరంగా చేపట్టాలని మంత్రి తలసాని ఆదేశించారు.

ప్రజలు ఇంకా సహకరించాలి.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రులు..

ప్రజలు ఇంకా సహకరించాలి.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రులు..

ఇప్పటికే జిహెచ్ఎంసిలోని ఎంటమాలజి, ఇ.వి.డి.ఎం ల ఆధ్వర్యంలో కరోనా నివారణకై హైపోక్లోరైడ్ ద్రావకం స్ప్రేయింగ్ పెద్ద ఎత్తున జరుగుతోందని, దీంతో పాటు ఫైర్ సర్వీస్ ల సహకారాన్ని కూడా పొందాలని ఆదేశించామని మంత్రి హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు. లాక్‌డౌన్ సడలించిన సమయంలో స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు తమ సహాయ సహకారాలను అందిస్తున్నాయని, అయితే లాక్‌డౌన్ సమయంలో కూడా ఉచిత భోజన, ఇతర సదుపాయాలను అందించే స్వచ్ఛంద సంస్థలు లేదా వ్యక్తులు తమ సమీపంలోని పోలీస్ స్టేషన్లలో సమాచారం అందించి ముందస్తు అనుమతి తీసుకోవాలని మంత్రి తెలియజేశారు.

అన్ని రకాల మందులు అందులు అందుబాటులో ఉన్నాయి.. కరోనా బాదితులు ఆందోళన చెందొద్దన్న తలసాని..

అన్ని రకాల మందులు అందులు అందుబాటులో ఉన్నాయి.. కరోనా బాదితులు ఆందోళన చెందొద్దన్న తలసాని..

రాజకీయాలకు అతీతంగా కరోనా నియంత్రణకు ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి మహమూద్ ఆలీ చేశారు. నగరంలోని ఆసుపత్రుల్లో బెడ్ ల లభ్యత, ఆక్సిజన్ సరఫరా, రెమిడిసివిర్ మందుల అందుబాటు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు జిహెచ్ఎంసి కమిషనర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, డ్రగ్ కంట్రోల్ జాయింట్ డైరెక్టర్, జిల్లా వైద్యాధికారి సభ్యులుగా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. కరోనా గురించిన సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు హెల్ప్ లైన్, కంట్రోల్ రూం ల గురించి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని హోం మంత్రి మహమూద్ అలీ సూచించారు.

  Gynaecologist Dr Abhinaya Alluri Interview PART 3 | oneindia telugu
  ప్రభుత్వ ముందుచూపుతోనే ఐసోలేషన్ కేంద్రాలు.. లాక్‌డౌన్ ను మరింత కఠినంగా అమలుచేస్తామన్న మేయర్..

  ప్రభుత్వ ముందుచూపుతోనే ఐసోలేషన్ కేంద్రాలు.. లాక్‌డౌన్ ను మరింత కఠినంగా అమలుచేస్తామన్న మేయర్..

  కరోన నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. నగరంలో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు సర్కిళ్లవారిగా ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలను ముందుస్తుగా ఏర్పాటు చేశామని తెలియజేశారు. నగరంలో పారిశుధ్య కార్యక్రమాలను మరింత ముమ్మరంగా చేపట్టేందుకు క్షేత్రస్థాయి తనిఖీలను తిరిగి ప్రారంభించనున్నట్లు మేయర్ పేర్కొన్నారు. కాగా గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలు, కోవిడ్ కంట్రోల్ రూం ద్వారా అందిస్తున్న సేవలను విజయలక్ష్మి వివరించారు.

  English summary
  Ministers Talsani Srinivasa Yadav and Mahmood Ali brought good news to the people of the city. He clarified that the number of positive cases in Greater Hyderabad has come down as various government departments are working effectively in coordination for the prevention of Covid. A high-level review meeting was held at the GHMC office on Monday on measures taken to control corona in the city.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X