Weather Alert:వాతావరణంలో అనూహ్య మార్పులు - బిగ్ అలర్ట్..!!

Summer:వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికీ పలు ప్రాంతా ల్లో తెల్లవారు జామున మంచు కనిపిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ దంచి కొడుతోంది. సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కోస్తాతో పాటుగా తెలంగాణలోని నిర్మల్‌ జిల్లా లింగా ర్‌లో అత్యధికంగా 40.7 డిగ్రీలు నమోదైంది. అత్యల్పంగా హైదరాబాద్‌లో 38.6 డిగ్రీలు నమోదు అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, ఈ రోజు.. రేపు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ అయింది.

ఆవర్తనం కారణంగా
హిందూ మహాసముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని కారణంగా ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అనేక చోట్ల వేడి వాతావరణం నెలకొంది. కోస్తా జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. నంద్యాలలో 40.2 డిగ్రీలు, అనంతపురం.. నందిగామలో 40.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, ఈ నెల 16వ తేదీ వరకు కోస్తాలో అనేక ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని.. రాయసీమలో వేడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

high-temperatures-upto-40-degrees-recorded-in-ap-and-telangana

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అప్పుడే 40 డిగ్రీలు దాటేశాయి. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో గురువారం 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది ఇదే రోజు కేవలం రెండు జిల్లాల్లోనే 40 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది రాష్ట్రంలోని దాదాపు సగం జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి.
నిర్మల్‌జిల్లా కడ్డం పెద్దూర్‌ మండలం లింగాపూర్‌లో గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా 40.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఇదే అత్యధికం. ఇక, రాష్ట్రంలోనే అత్యల్పంగా హైదరాబాద్‌లో గురువారం 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

అప్రమత్తంగా ఉండాలి
రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగనుందని హెచ్చరించిన హైదరాబాద్‌ వాతావరణ కేం ద్రం.. శుక్ర, శనివారాల్లో పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. మిగిలిన జిల్లాలకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో పగ టి ఉష్ణోగ్రతలు సగటున 38-41 డిగ్రీల మధ్య, రాత్రిపూట 19-23 డిగ్రీ ల మధ్య నమోదయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీంతో, వాతావరణంలో వస్తున్న మార్పులతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రధానం గా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. ఇక, రెండు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కారణంగా ఒంటి పూట బడులు ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+