coronavirus: గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద హైటెన్షన్, స్టూడెంట్స్‌ను నిలిపివేసిన ఏపీ అధికారులు..
తెలంగాణ-ఆంధ్రా సరిహద్దులో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌లో ఉన్న హాస్టళ్లు మూసివేయడంతో సొంత ఊరి బాటపట్టారు. హైదరాబాద్ పోలీసుల అనుమతి తీసుకొని వచ్చిన వారిని సరిహద్దులో ఆంధ్రా పోలీసులు అడ్డుకున్నారు. ఏపీలోకి రానీయకపోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గత 7 గంటల నుంచి విద్యార్థులు రోడ్డుపైనే నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వ తీరు, అధికారులపై మండిపడుతున్నారు.
తమ సొంత ఇంటికి వెళతామని చెప్పడంతో హైదరాబాద్ పోలీసులు ఎన్‌వోసీ ఇచ్చి పంపించారు. అయితే గరికపాడు చెక్ పోస్ట్ వద్ద విద్యార్థుల వాహనాలను నిలిపివేశారు. దాదాపు వెయ్యి మంది వరకు.. గంటల కొద్దీ ఉండటంతో ఆగ్రహాం పెల్లుబికింది. తమకు తినడానికి తిండి లేదని.. తాగడానికి నీళ్లు లేవని విద్యార్థులు వాపోతున్నారు.

Recommended Video
ఘటనాస్థలానికి వచ్చిన ఎమ్మెల్యే సామినేని ఉదయభాను.. అధికారుల తప్పిదం వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు. తర్వాత మీడియాతో విజయవాడ సబ్ కలెక్టర్ మాట్లాడారు. అంతరాష్ట్రం దాటి వస్తోన్న విద్యార్థులను క్వారంటైన్ చేస్తామని పేర్కొన్నారు. వారిని బస్సుల్లో తీసుకెళతామని చెప్పారు. మరోవైపు విద్యార్థుల రాక కోసం పేరెంట్స్ ఇంటి వద్ద కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications