తెలంగాణ చరిత్రలోనే అత్యంత భారీ వర్షపాతం నమోదు: ఎక్కడంటే?

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా వారం కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రహదారులు, వెంతనెలు కొట్టుకుపోవడంతో గ్రామాలు, పట్టణాల మధ్య రవాణా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో వరదనీటిలో పలువురు గల్లంతయ్యారు.

కాగా, తెలంగాణ చరిత్రలోనే అత్యంత భారీ వర్షపాతం నమైదైంది. 24 గంటల్లో ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో ఏకంగా 64 సెంటిమీటర్ల వర్షపాతం కురిసింది. ఇప్టపి వరకు 2013 జులై 19న ములుగు జిల్లా వాజేడులో కురిసిన వర్షపాతం 51 సెంటిమీటర్లే అత్యధకంగా ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసింది. మరోవైపు, గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెంటిమీటర్లు, 200 కేంద్రాల్లో 10 సెం.మీ. పైగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

heavy rains

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం బూరుగుపేటలో విషాదం చోటు చేసుకుంది. చెరుకు గండి సమీపంలోని ఓ ఇల్లు కొట్టుకుపోవడంతో ముగ్గురు గల్లంతయ్యారు. భారీ వర్షాలతో బూరుగుపేటలోని మారేడుగొండ చెరువులో భారీ వరదనీరు చేరింది. దీంతో బుధవారం రాత్రి వరద మరింత పెరగడంతో చెరువుకు గండి పడింది.

వరద ప్రవాహం భారీగా రావడంతో ఇల్లు కొట్టుకుపోయింది. వరదనీటి ఉధృతికి ఇంట్లో నిద్రిస్తున్న బండ సారయ్య(60), బండ సారమ్మ(58), బండ రాజమ్మ(80) గల్లంతయ్యారు. కాగా సారయ్య మృతదేహం గ్రామానికి సమీపంలోని పంటపొలాల్లో లభ్యమైంది. మిగితా ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పూర్తిగా నీటమునిగిన మోరంచపల్లి గ్రామంలో.. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సాధారణ హెలికాప్టర్లు ఈ వాతావరణ పరిస్థితుల్లో సంచరించడం కష్టమయ్యే అవకాశం ఉండటంతో ఆర్మీ హెలికాప్టర్ల కోసం సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారులతో సీఎస్ శాంతి కుమారు మాట్లాడారు. అనంతరం రెండు హెలికాప్టర్లను మోరంచపల్లికి హెలికాప్టర్లను పంపుతున్నట్లు తెలిపారు.

భద్రకాళి ఆలయం వద్ద అయ్యప్పస్వామి గుడిలోకి వరదనీరు చేరింది. మరోవైపు, కాజీపేట రైల్వే స్టేషన్, వరంగల్ బట్టల బజార్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. హనుమకొండ-వరంగల్ రహదారి బ్రిడ్జిపైనుంచి వరదనీరు ప్రవహిస్తోంది. వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి కింద వరదనీరు నిలిచింది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి జలదిగ్భంలోనే ఉంది. కాగా, మరో రెండు రోజులపాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది జిల్లా వాతావరణ శాఖ. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+