భాగ్యనగర వాసులు ఇకపై ఈ నీళ్లే వాడాలి.. 'గ్రీన్ వాటర్' ట్యాంకర్ల రేట్లు ఎంతంటే?

రాబోయే కాలంలో నగరానికి నీటి ఎద్దడి ముప్పు పొంచి ఉండటంతో భాగ్యనగవాసుల దాహార్తిని తీర్చేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రోజురోజుకూ పడిపోతున్న భూగర్భ జలాలు, మంజీరా, సింగూరు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడం వల్ల తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ అడుగులు వేసింది. ఇకపై భవన నిర్మాణాలు, వాషింగ్ స్టేషన్లు, తోటల పెంపకం వంటి తాగడానికి ఉపయోగపడని అవసరాలకు శుద్ధి చేసిన మురుగునీటిని అందిస్తూ 'గ్రీన్ వాటర్' ట్యాంకర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. నవంబర్ 1 నుంచి ప్రారంభమైన ఈ సేవ ద్వారా తాగునీటి దుర్వినియోగానికి అడ్డుకట్ట పడనుంది.

ప్రాసెస్ చేసిన నీళ్లే దిక్కు.. గ్రీన్ కలర్ ట్యాంకర్లతో గుర్తింపు!

నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సీవరేజ్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ద్వారా రోజూ వేల మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేస్తున్నారు. ఈ నీటిని వృథాగా వదలకుండా మానవేతర అవసరాలకు వాడాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. తొలి విడతగా 21 ప్రత్యేక గ్రీన్ ట్యాంకర్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ ట్యాంకర్లకు పచ్చటి రంగు పూసి.. 'ఎస్టీపీ శుద్ధి నీరు - తాగునీరు కాదు' అని స్పష్టమైన హెచ్చరికను ప్రదర్శిస్తున్నారు. నగరవ్యాప్తంగా 27 ప్రాంతాల్లో ఫిల్లింగ్ పాయింట్లను ఏర్పాటు చేసి, రోజుకు 646 ఎంఎల్‌డీల నీటిని పంపిణీ చేయనున్నారు. దాదాపు 100 ప్రైవేట్ ట్యాంకర్లు కూడా ఈ విభాగంలో రిజిస్టర్ అయ్యాయి.

HMWSSB Launches Green Water Tanker Service in Hyderabad for Non Potable and Construction Requirements
మంజీర, సింగూర్ లల్లో డెడ్ స్టోరేజ్: హైదరాబాద్ లో వాటర్ ఎమర్జెన్సీ
మంజీర, సింగూర్ లల్లో డెడ్ స్టోరేజ్: హైదరాబాద్ లో వాటర్ ఎమర్జెన్సీ

తాగునీటి దుర్వినియోగానికి చెక్.. ఆయా రంగాలకే ప్రాధాన్యం!

ఇటీవలే బంజారాహిల్స్‌లో తాగునీటితో కార్లు కడుగుతున్న దృశ్యాన్ని చూసి అధికారులు రూ.10 వేల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. నిర్మాణ రంగం, గార్డెనింగ్, పరిశ్రమలతో పాటు స్విమ్మింగ్ పూల్స్‌లో నీటిని మార్చేందుకు భారీగా మంచి నీరు వృథా అవుతోంది. ఇప్పుడు ఈ గ్రీన్ వాటర్ సర్వీస్ రాకతో తాగునీటి డిమాండ్‌ దాదాపు 20 శాతం వరకు తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎస్టీపీ ప్లాంట్ల వద్ద నీటి నాణ్యతను (పీహెచ్, టీడీఎస్, ఇతర ప్రమాణాలు) నిరంతరం పరిశీలించేందుకు ప్రత్యేకాధికారుల బృందాలు కూడా రంగంలోకి దిగాయి.

రాజ‌ధానిలో తాగు నీటి స‌మ‌స్య రాకూడ‌దు: సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఎంతో అందుబాటులో రవాణా ఛార్జీలు.. ధరల వివరాలు ఇవే!

జలమండలి ఈ నీటిని ఉచితంగా ఇస్తూ కేవలం రవాణా ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తోంది. కస్టమర్ల అనుకూలత కోసం కిలోమీటర్ల ప్రాతిపదికన నిర్దిష్ట ధరలను ఖరారు చేసింది.

  • 5 వేల లీటర్లు: మొదటి 4 కిలోమీటర్ల పరిధికి రూ. 400. ఆ తర్వాత ప్రతి అదనపు కిలోమీటరుకు రూ. 55.
  • 10 వేల లీటర్లు: మొదటి 4 కిలోమీటర్ల వరకు రూ. 800. ఆ పైన ప్రతి కిలోమీటరుకు రూ. 65.
  • 20 వేల లీటర్లు: మొదటి 4 కిలోమీటర్లకు రూ. 1600. ఆ దాటితే ప్రతి కిలోమీటరుకు రూ. 80 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

పర్యావరణ స్పృహను పెంచుతూ, భవిష్యత్తు నీటి ఎద్దడిని తట్టుకునేందుకు జలమండలి తెచ్చిన ఈ మార్పుపై నగరవాసుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+