గుర్రం బీభత్సం: బైక్‌పైనున్న వారిని బలంగా తన్నింది, ఒకరి మృతి

ఆదివారం అర్ధరాత్రి పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. అనుభవంలేని ఓ వ్యక్తి గుర్రం స్వారీ చేస్తూ బైక్‌‌ను ఢీ కొట్టాడు. ఆ గుర్రం బైక్‌ను, దాని పైన ఉన్న ఇద్దరిని బలంగా తన్నింది.

హైదరాబాద్: ఆదివారం అర్ధరాత్రి పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. అనుభవంలేని ఓ వ్యక్తి గుర్రం స్వారీ చేస్తూ బైక్‌‌ను ఢీ కొట్టాడు. ఆ గుర్రం బైక్‌ను, దాని పైన ఉన్న ఇద్దరిని బలంగా తన్నింది. ఈ ప్రమాదంలో బైక్ పైన ఉన్న ఇద్దరిలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

హైదరాబాద్ శివారు మైలార్‌దేవ్‌పల్లిలో గుర్రం బీభత్సం సృష్టించింది. గుర్రంపై స్వారీ చేస్తున్న సోహైల్ అనే యువకుడు బైక్‌ను ఢీకొట్టాడు. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు కిందపడగా, వట్టేపల్లికి చెందిన హమీద్ మృతి చెందాడు.

horse

అదే గ్రామానికి చెందిన ఖాజం తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అతనికి చికిత్స అందిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

బాధితుల ఫిర్యాదుతో మైలార్‌దావ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

కాగా, నిందితుడు.. అంటే అప్పుడు గుర్రం పైన ఉన్నది స్థానిక తెరాస నాయకుడి కొడుకు ఫరూఖ్ అని తెలుస్తోంది. అతని వయస్సు పదహారేళ్లు.

సదరు నాయకుడు స్థానికంగా పెళ్లిళ్లకు రెంటుకు ఇచ్చేందుకు ఓ గుర్రం కొన్నాడు. దాని పైన అతని కొడుకు రైడింగ్‌కు వెళ్లాడు. ఈ సమయంలో ప్రమాదం జరిగింది. అతను గుర్రం పైన ఫాస్టుగా రోడ్డుపైకి వచ్చాడు. అతని నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగింది. దీంతో అతనిపై కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+