Heatwave 2024: రాష్ట్రంలో మరో వారం తీవ్ర ఎండలే..!
రాష్ట్రంపై భానుడు పంజా విసురుతున్నాడు. భారీ ఉష్ణోగ్రతలు ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలా జిల్లాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వారం రోజుల పాటు వడ గాలులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం తెలంగాణలోని 10 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. జోగులాంగ గద్వాల్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
సింగరేణి ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఖమ్మం జిల్లాలో గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో కూడా అదే స్థాయిలో టెంపరేచర్లు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాలతో పోలస్తే హైదరాబాద్ కాస్త తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.

తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో 41 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఐఎండీ తెలిపింది. కరీంనగర్ జిల్లాలో వడ దెబ్బతో ప్రభుత్వ అధికారి మృతి చెందారు. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉదయం 11 గంటల తర్వాత బయటకు రావొద్దని కోరుతున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు.
అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని చెబుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వడ గాలుల వల్ల గాలిలో తేమ శాతం వేడి పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధానంగా చెట్ల నరికివేత, కాలుష్యం పెరగడం, అర్బనైజేషన్ పెరగడం కారణమని వివరిస్తున్నారు.












Click it and Unblock the Notifications