రోడ్లపై వ్యర్థాలు వేస్తే ఖబర్దార్..! గుట్కా వేసుకుని తుపుక్కున ఉమ్మితే భారీ మొత్తంలో జరిమానా..!!
హైదరాబాద్ : హైదరాబాద్ విశ్వ నగరం దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. అంతే కాదు సింగపూర్ దేశంలోని కఠిన నిర్ణయాలను కూడా అమలు చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది నగర పాలక సంస్థ. నగరం ఎంత పరిశుభ్రంగా ఉంటే చూసే వారికి గాని, యాత్రికులకు గాని అంత ఆహ్లాదంగా ఉంటుంది. దీన్నే ఆసరా చేసుకుని మున్సిపల్ అదికారులు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. పరిశుభ్రంగా ఉండాల్సిన రహదారుల్లో చెత్త చెదారం వేస్తే కొరడా ఝుళిపించేందుకు రంగం సిద్దం చేస్తోంది నగర పాలక సంస్థ.
చెత్త వేయడమే కాకుండా నోటీ నిండా గుట్కా వేసుకుని తుప్పుక్కున ఉమ్మేసే వాళ్ల భరతం పట్టేందుకు కఠిన నిబంధనలను అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించింది జీహెచ్ఎంసీ.రోడ్లపై ఇష్టానుసారంగా భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త వేస్తున్న వారిపై జీహెచ్‌ఎంసీ కొరడా ఝులిపిస్తోంది. రోడ్లపక్కన చెత్త వేస్తున్న ఇద్దరికి మంగళవారం 40 వేల రూపాయల జరిమానా విధించారు.

చందానగర్ వెంకటాద్రి కాలనీకి చెందిన రవీందర్‌రెడ్డి భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్డుపై వేసినందుకు 30 వేల రూపాయల జరిమానా విధించారు. రోడ్డుపై చెత్త వేయడంతో పాటు డస్ట్‌బిన్‌లను సైతం ఏర్పాటు చేసుకోకపోవడంతో మూసాపేటలోని సాయి బాలాజీ వైన్స్‌కు 10 వేల రూపాయల జరిమానా విధించారు. నగరంలో రోడ్డుపై వెలుతూ ఉమ్మితే ఇక జరిమానా విధించనున్నారు. ఇప్పటికే దీనిపై అధికారులు చర్చించారు.
ఇకనుంచి అమలుఅవుతుందని కొన్ని రోజుల క్రితం బాగ్యనగరం జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. తాజాగా బుధవారం కుషాయిగూడ డిపోకు చెందిన బస్సు లింగంపల్లి వెళ్తుండగా డ్రైవర్ జగదీశ్ రోడ్డుపై ఊసాడు. దీంతో పక్కనే ఉన్న జీహెచ్ఎంసీ సిబ్బంది డ్రైవర్ కు జరిమానా విధించారు. దీంతో జరిమానా వంద రూపాయలను డ్రైవర్ చెల్లించాడు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications