వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెట్‌లో హల్‌చల్ చేస్తున్న తెలంగాణ పర్యాటక శాఖ షార్ట్ ఫిల్మ్ ఇదే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ పర్యాటకంపై రూపొందించిన ఓ షర్ట్ ఫిల్మ్ ప్రస్తుతం ఇంటర్నెట్‌ల్ హల్‌చల్ చేస్తోంది. జాతీయ స్థాయిలోనే కాక, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలను అందుకుంటోంది ఆ వీడియో ‘వెల్‌కమ్ టు తెలంగాణ'. ఈ షార్ట్ ఫిల్మ్‌ను విడుదలైన పది రోజుల్లోనే 25లక్షలమంది వీక్షించిండం విశేషం.

అబ్బురపరిచే ప్రకృతి సౌందర్యంలోకి నడిపిస్తూ, కనువిందు చేసే కట్టడాల మధ్య తిప్పుతూ, శ్రమైక్య జీవన సౌందర్యాన్ని కళ్లకు కడుతూ.. ప్రతి వీక్షకుడినీ తెలంగాణలోకి నడిపిస్తోంది పర్యాటక శాఖ రూపొందించిన ఈ వీడియో.

తెలంగాణలోకి అడుగుపెట్టే పర్యాటకులకు, పరిశోధకులకు గోల్కొండ కోట, ఓరుగల్లు కోటలే తొలి ప్రాధమ్యాలు. గ్లోరియస్ లెగసీ ఆఫ్ డైనాస్టీని పరిచయం చేస్తూనే సుపరిచితమైన కట్టడాల కంటే ప్రాచుర్యం పొందని ప్రాచీన వైభవానికే అధికప్రాధాన్యం ఇచ్చాడు వెల్‌కమ్ టు తెలంగాణ దర్శకుడు దూలం సత్యనారాయణ.

సత్యనారాయణది ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల. చదివిందే ఇంటరే. సామాజిక స్పృహ మాత్రం చెప్పలేనంత. దేశమంతా తిరిగేశాడతను. అతడు ఇప్పటికే చాలా డాక్యుమెంటరీలు తీశాడు. అంతర్జాతీయ స్థాయిలోనూ అతను రూపొందించిన డాక్యుమెంటరీలు ప్రదర్శితమయ్యాయి. కాగా, తెలంగాణ టూరిజం డాక్యుమెంటరీకి వినయ్, ప్రవీణ్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ సహకారం అందించారు. పవన్ శేష సంగీత సహకారం అందించారు.

Huge Response For Tourism Departments Short Film 'Welcome To Telangana'

అడవుల్లో పడుకుని ఒక్కే ప్రదేశాన్ని 10 నుంచి 15 సార్లు టేకింగ్ చేసినట్లు, తమ కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు వెల్‌కమ్ టు తెలంగాణ రూపకర్తలు. ఇతర దేశాల వాళ్లు కూడా ప్రశంసించారని తెలిపారు. ప్రస్తుతం ‘వెల్‌కమ్ టు తెలంగాణ'ను వీక్షించిన వారి సంఖ్య 33లక్షలకు చేరిందని సత్యనారాయణ తెలిపారు.

కాగా, ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 27న నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటిఆర్ ‘వెల్‌కమ్ టు తెలంగాణ'ను విడుదల చేశారు. విడుదలైన పదిరోజుల్లోనే 25లక్షలమంది వీక్షించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ వీడియోకు ప్రశంసలు వచ్చాయి.

Huge Response For Tourism Departments Short Film 'Welcome To Telangana'

111దేశాల వారు వీక్షించి మెచ్చుకున్నారు. వీరిలో ఉత్తరఅమెరికా, ఐరోపా, అరబ్ దేశాలకు చెందిన వారున్నారు. ఇన్‌క్రెడిబుల్ ఇండియా అంటే.. కాశ్మీర్, గుజరాత్, రాజస్థాన్, గోవా, కేరళ, ఈశాన్య రాష్ట్రాలే కాదు.. తెలంగాణ కూడా వాటి సరసన ఉంటుందని రుజువు చేసిందంటూ.. యూకే ట్రావెల్ మేగజైన్ ప్రశంసించడం గమనార్హం. అంతేగాక, ఈ మేగజైన్ ఏకంగా ఓ పేజీ కథనాన్ని ప్రచురితం చేసింది.

English summary
Huge Response For Tourism Departments Short Film 'Welcome To Telangana'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X