హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రగ్ కేసు: నటుల డైలమా, వారి కోసం వేట! కేసీఆర్ కీలక నిర్ణయం

డ్రగ్స్ మాఫియా కేసు విచారణను సిట్ ముమ్మరం చేసింది. ఈ కేసులో నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులను బుధవారం నుంచి విచారించనుంది. విచారణకు హాజరు కావాలని సిట్ నుంచి పలువురు నటీనటులకు నోటీసులు వెళ్లాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్స్ మాఫియా కేసు విచారణను సిట్ ముమ్మరం చేసింది. ఈ కేసులో నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులను బుధవారం నుంచి విచారించనుంది. విచారణకు హాజరు కావాలని సిట్ నుంచి పలువురు నటీనటులకు నోటీసులు వెళ్లాయి.

ఒక్క డోస్ ప్లీజ్: డ్రగ్ కోసం అధికారుల వద్ద కెల్విన్, బయటకొస్తా.. వ్యాపారం చేస్తా!ఒక్క డోస్ ప్లీజ్: డ్రగ్ కోసం అధికారుల వద్ద కెల్విన్, బయటకొస్తా.. వ్యాపారం చేస్తా!

ఏం చేద్దాం

ఏం చేద్దాం

ఈ నేపథ్యంలో సిట్ విచారణకు హాజరు కావాలా? హాజరైతే ఎలా వ్యవహరించాలనే దానిపై నోటీసులు అందుకున్న ప్రముఖులు డైలమాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వారు సరైన లాయర్ కోసం వేట మొదలు పెట్టారని తెలుస్తోంది.

రేపటి నుంచి విచారణ

రేపటి నుంచి విచారణ

లాయర్ల నుంచి న్యాయ సలహా తీసుకున్న అనంతరం సిట్ విచారణకు హాజరు కావాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 19వ తేదీ నుంచి వరుసగా ప్రముఖులను విచారించనున్నారు.

Recommended Video

Tollywood drugs scandal : Tollywood Top Director, Heroes and 3 Heroines Names revealed
వరుసగా వీరు..

వరుసగా వీరు..

ఈ నెల 19వ తేదీన పూరీ జగన్నాథ్, 20న చార్మి, 21న ముమైత్ ఖాన్, 22న నటుడు సుబ్బరాజు, 23న కెమెరామెన్ శ్యాం కే నాయుడు సిట్ ఎదుట హాజరు కానున్నారు. రవితేజ కూడా ఈ నెల 24న హాజరు కానున్నారు. 26న ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, 26న నవదీప్, 27న తరుణ్, 28న తనీష్, నందులను విచారించనున్నారు.

219 మంది అధికారుల బదలీ

219 మంది అధికారుల బదలీ

ఓ వైపు డ్రగ్స్ కేసులో విచారణ జరుగుతుండగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖలో 219 మంది అధికారులను బదలీ చేస్తున్నట్లు ఉదయం ఉత్తర్వులు వచ్చాయి. 23 మంది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌లు, 196 మంది ఇన్స్‌పెక్టర్‌లను బదలీ చేస్తూ జీవో విడుదల చేశారు.

English summary
219 officers transferred in Telangana Excise Department on Tuesday. GO released on July 18th morning on transfer issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X