వామ్మో వీళ్లేం భార్యాభర్తలు.. అంతకు మించి

భార్యాభర్తలంటే అన్యోన్యానికి, దాంపత్యానికి మారుపేరుగా నిలుస్తారు. కానీ వీళ్లు మాత్రం ఆ పదానికే మచ్చ తెచ్చారు. ఒకరి తప్పుల్ని సరిదిద్దుతూ మరొకరు వెళ్లాల్సిన బదులు.. ఇద్దరూ పక్కా ప్లాన్ చేసుకుని అరాచకాలకు తెగబడ్డారు. పేద అమ్మాయిలే టార్గెట్ గా కొంచెం కూడా సిగ్గు, శరం లేకుండా వ్యవహరించారు. పేదింటి బిడ్డలే లక్ష్యంగా చేసుకుని అమాయకుల జీవితాలను నాశనం చేస్తున్న ఈ కిలాడీ కపుల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఏం జరిగింది..?

వరంగల్ జిల్లా మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గవిచర్ల రోడ్డులో రాజీవ్, సునీత అనే దంపతులు ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుగా వ్యభిచార దందా నడుపుతున్నట్టు సమాచారం వచ్చింది. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ ఇంటిపై దాడులు నిర్వహించారు. వారి నుంచి ఒక బాధిత యువతిని రక్షించారు.

Husband and Wife Arrested for Running Brothel in Warangal

ఇది మొదటిసారి కాదు.. రాజీవ్, సునీత దంపతులు ఇదివరకే ఇదే విధంగా వ్యభిచారం నిర్వహిస్తూ అరెస్ట్ అయ్యారు. జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆ తర్వాత బయటకు వచ్చి మళ్లీ అదే పని ప్రారంభించారు. తాజాగా మరోసారి ఆ కిలాడీ కపుల్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు, రూ.1500 నగదు, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఈ వ్యభిచారం పక్కా ప్రణాళికతోనే జరుగుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. గతంలో కరీంనగర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థిని కూడా వీరి వలలో పడినట్టు పోలీసులు గుర్తించారు. పేద పిల్లలకు డబ్బు ఆశ చూపి ఈ రొంపులోకి దింపుతున్నట్లు గుర్తించారు. మరోవైపు ఇలాంటి మోసగాళ్లపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాజీవ్, సునీతలపై కఠిన చట్టాలు అమలు చేసి మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+