ప్రియురాలి కోసం భార్యను చంపి, పాతిపెట్టాడు
హైదరాబాద్: తన ప్రియురాలి కోసం ఓ భర్త తన భార్యను హత్య చేసిన సంఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు ప్రాంతంలో జరిగింది. రెండు నెలల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం గందంగూడలో ఇది చోటు చేసుకుంది.
దీని పైన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ప్రియురాలు కోసం భార్యను చంపి పాతిపెట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుడిని పోలీసులు విచారించనున్నారు. అనంతరం శవాన్ని వెలికితీస్తారు.

నల్గొండలో ఫ్లెక్సీల కలకలం
నల్గొండ జిల్లాలో కేసీఆర్ ఖబడ్దార్ అంటూ వెలిసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. కేసీఆర్ ఖబడ్దార్.. పెండింగులో ఉన్న స్కాలర్ షిప్‌లు వెంటనే విడుదల చేయాలంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఫాస్ట్ పథకంపై విధివిధానాలు ఖరారు చేయాలంటూ రాడికల్ స్టూడెంట్ యూనియన్ పేరుతో బ్యానర్లు వెలిశాయి.
నాగార్జున సాగర్ జలాశయం వద్ద తెరాస ఆందోళన
నాగార్జున సాగర్ జలాశయం వద్ద తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాలు సోమవారం ఆందోళన చేపట్టాయి. కుడికాల్వకు నీరు విడుదల చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ జలాశయం వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications