రెండోపెళ్ళికి అడ్డుందని భార్యపై క్షుద్రపూజలు చేయించిన భర్త.. పోలీసుల ఎంట్రీతో..ఏం జరిగిందంటే!!
సమాజంలో రోజురోజుకు మానవ సంబంధాలకు, అనుబంధాలకు విలువ లేకుండా పోతుంది. భార్యలను భర్తలు హతమార్చడం, భర్తలను భార్యలు అనంత లోకాలకు పంపించడం నిత్యకృత్యంగా మారిపోయింది. పెళ్ళినాడు చేసుకున్న వాగ్దానాలకు, ఒకరికొకరు కట్టుబడి జీవించాలనే నియమానికి విలువ లేకుండా పోతుంది. ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాని పరిస్థితి సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తుంది.

సమాజంలో పెరిగిపోయిన హత్యలు .. వైవాహిక బంధానికి తూట్లు
ఇక భార్యాభర్తల మధ్య నిత్యం చోటు చేసుకుంటున్న గొడవలు, ఒకరిని ఒకరు చంపుతున్న ఘటనలు వారి పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇక భార్యలను భర్తలు, భర్తలను భార్యలు హతమార్చడం కోసం వేస్తున్న ప్లాన్స్ సైతం షాక్ కు గురి చేస్తున్నాయి. ఇక తాజాగా హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకున్న ఓ ఘటన పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఇక సీన్ లోకి ఎంటర్ అయిన పోలీసులు అక్కడ జరుగుతున్న తంతు చూసి ఖంగుతిన్నారు.

రెండో పెళ్ళికి అడ్డుగా ఉందని భార్యపై క్షుద్రపూజల ప్రయోగం చేసిన భర్త
హైదరాబాద్లోని పాతబస్తీలో రెండో పెళ్లికి అడ్డుగా ఉందని భార్యపై ఓ భర్త క్షుద్రపూజలకు పాల్పడ్డాడు. భార్య అడ్డు తొలగించుకోవాలని భావించిన భర్త, భార్యను చంపడం కోసం చేతబడి ప్రయోగించాడు. ఒక బాబాను ఇంటికి పిలిపించి అతని సాయంతో భార్యపై క్షుద్ర పూజలు చేయించాడు. ఇక స్థానికులు అందించిన సమాచారంతో భర్త కథ అడ్డం తిరిగింది. కామాటిపుర పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడి ఇంటిపై దాడి చేసి దొంగ బాబాను, భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఇక చేతబడి నుండి మహిళను రక్షించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

భార్యపై చేతబడి చేయించిన భర్తపై కేసు నమోదు .. దర్యాప్తు
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు భర్త భార్యపై ఎందుకు చేతబడి చేయిస్తున్నాడు. అతనితో రెండవ పెళ్ళికి ఒప్పుకున్న మహిళ ఎవరు ? అయితే భర్త ఒక్కడి పాత్ర ఇందులో ఉందా? లేక మరెవరినైనా పాత్రయినా ఉందా? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో క్షుద్ర పూజల పేరుతో చేస్తున్న ఇటువంటి ఘటనలు, అందునా భార్యను చంపడం కోసం ఓ భర్త చేసిన ఈ నిర్వాకం ప్రస్తుతం పాతబస్తీలో చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications