వివాహమై ఏడాది...భార్య తీరు నచ్చక అతడు ఏం చేశాడంటే
భార్య,భర్లల మధ్య గొడవ చివరికి భర్త ప్రాణాలు తీసుకొనే పరిస్థితి వరకు తెచ్చింది. ఏడాది క్రితం వివాహం చేసుకొన్న రవీందర్, వైష్ణవిలు చిన్న విషయాలకు గొడవపడేవారు. శనివారం నాడు కూడ గొడవపడ్డారు.
హైదరాబాద్ : వివాహం జరిగి ఏడాది కూడ కాలేదు. భార్య,భర్తల మధ్య ఎప్పుడూ తగవులే. ఇరు వర్గాలకు చెందిన పెద్దలు భార్య,భర్తలకు నచ్చజెప్పారు. అయినా పరిస్థితిలో మార్పురాలేదు. ఎప్పటిలానే భార్య,భర్తలు గొడవపడుతున్నారు.ఈ గొడవలు ఏకంగా భర్త మరణానికి దారితీశాయి. తనపై భార్య పోలీసుకలు ఫిర్యాదు చేయడంతో ....భర్త ఆత్మహాత్య చేసుకొన్నాడు.
చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకోవడం పరిపాటిగా మారింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని హైదర్ గూడ కు చెందిన జన్న రవిచందర్ , వైష్ణవి లకు ఏడాది క్రితం వివాహమైంది. వివాహమైన నాటి నుండి భార్య,భర్తల మధ్య ఏనాడు సఖ్యత లేకుండా పోయింది.

ప్రతి చిన్న విషయానికి ఇద్దరు గొడవలు పడేవారు. పెద్దలు ఇద్దరి మద్య రాజీ కుదుర్చేవారు. ప్రతి సారి జరిగినట్టుగానే శనివారం నాడు కూడ భార్య,భర్తల మద్య గొడవ జరిగింది. దీంతో తనపై దాడి చేశాడని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది .భర్త పై కోపంతో పుట్టింటికి వెళ్ళిపోయింది.భార్య వైఖరితో మనోవేదనకు గురైన భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.
భార్య పుట్టింటికి వెళ్ళిపోవడంతో పాటు తనపై అకారణంగా పోలీసులకు ఫిర్యాదు చేసిందనే మనోవేదనతో భర్త ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. తన చావుకు భార్య కారణమని ఆయన లేఖ రాశాడు. ఈ లేఖ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications