• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హుజురాబాద్ పోరు: క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ .. ఈసారైనా పరువు దక్కుతుందా?

|
Google Oneindia TeluguNews

హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ దూకుడు చూపించలేకపోతుందా? ఎన్నికల ప్రచారంలో మిగతా పార్టీల కంటే కాంగ్రెస్ వెనకే ఉందా? అంటే అవును అనే అంటున్నారు. అభ్యర్థిని ప్రకటించడం దగ్గరనుండి అన్ని విషయాలలోనూ కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ కు బలమైన పోటీ ఇవ్వలేక పోతుందని హుజురాబాద్ లో ప్రచార సరళిని బట్టి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారైనా కాంగ్రెస్ కు పరువు దక్కుతుందో లేదో అన్న చర్చ సాగుతుంది.

హుజురాబాద్ అభ్యర్థి ప్రకటనలో వెనకబడిన కాంగ్రెస్
హుజురాబాద్ నియోజకవర్గ ఉపఎన్నిక బరిలో అభ్యర్థిని ప్రకటించడానికి కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడింది. పోటీలోకి ఎవరిని దించాలి అన్నదానిపై సుదీర్ఘ చర్చల తర్వాత ఆలస్యంగా నిర్ణయం తీసుకుంది. మొదటి కొండా సురేఖ ఒక అవకాశం ఇస్తామని కాంగ్రెస్ భావించినా, ఆ తర్వాత ఆమె నో చెప్పటంతో ఆ ఆలోచనను మానుకొని టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను డీకొట్టగలిగిన యువ నాయకుడు అని భావించి ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బలమూర్ వెంకట్ పేరును ప్రకటించారు. నిరుద్యోగ సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించింది.

Huzurabad by-poll: campaigners list of congress, Trailing in competition

కాంగ్రెస్ కంటే ముందే ఎన్నికల ప్రచార బరిలో టీఆర్ఎస్, బీజేపీ
అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించే నాటికే అటు అధికార టీఆర్ఎస్ పార్టీ, బిజెపి హోరాహోరీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. నువ్వా నేనా అంటూ టీఆర్ఎస్ బీజేపీలు తలపడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ పార్టీ నుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న స్టార్ క్యాంపెయినర్ ల జాబితాను రిలీజ్ చేసింది. హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారానికి రెడీ అయ్యింది.

ఎన్నికల క్యాంపెయినర్ ల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్
20 మందితో కూడిన క్యాంపెయినర్ల జాబితాను రిలీజ్ చేసింది కాంగ్రెస్ . కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన జాబితాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మణిక్కం ఠాగూర్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ తదితరులు ఉన్నారు. కానీ హుజురాబాద్ ఉప ఎన్నిక గురించి స్పష్టమైన వ్యూహం కాంగ్రెస్ పార్టీకి లేదనేది క్లియర్ గా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముందుండి నడిపించే వారెవరో అన్నది కూడా అర్థం కాని పరిస్థితి.

ప్రత్యర్ధి పార్టీలను ఎదుర్కోలేని స్థితిలో కాంగ్రెస్
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అలక వహించిన వారిని బుజ్జగించడానికే సమయం సరిపోతుంది. ఈ సమయంలో ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనేలా కాంగ్రెస్ సిద్ధంగా లేదన్నది అందరికీ అర్థమైన విషయం. గత ఎన్నికల్లో హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కాస్త మెరుగైన ఓటుబ్యాంకునే సాధించింది. ఈ సారి ఇంత ఆలస్యంగా బరిలోకి దిగి, ప్రచారంలో వెనుకబడి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందా అన్నది పెద్ద ప్రశ్నే. అయినప్పటికీ అధికార పార్టీని టార్గెట్ చేస్తూ, కెసిఆర్ సర్కారు తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికను ఆయుధంగా చేసుకోనుంది కాంగ్రెస్ పార్టీ.

హుజురాబాద్ లో కాంగ్రెస్ పరువు దక్కించుకుంటుందా?
నిన్నటితో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక ప్రచార పర్వం ఊపందుకుంటున్న సమయంలోనైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా వెళుతుందా? కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్ లో ఒక్క అవకాశం ఇవ్వండి! నాలుగు కోట్ల ప్రజల కోసం, డిల్లీలో ఉన్న మోడీ, గడీల ఉండే కేడీ ఇద్దరి మెడలు వంచుతాం అంటూ చెప్తున్న రేవంత్ రెడ్డి ప్రజల మద్దతు కూడగట్టటంలో సక్సెస్ అవుతారా? ఈ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీ పరువు దక్కించుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ నేతల్లో సమిష్టి లేకపోవటమే పార్టీకి నష్టం చేస్తుంది అనేది నిర్వివాదాంశం.

English summary
Congress has released a list of 20 campaigners for huzurabad by election campaign. The list released by the Congress party includes Telangana Congress party in-charge Manikkam Tagore, TPCC president Revant Reddy and others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X