Huzurabad By-poll : 'గెల్లు'కు అవకాశం వెనుక కేసీఆర్ షాకింగ్ స్ట్రాటజీ .. యువతపై ఫోకస్; మతలబు ఇదే !!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోకస్ యువతపై పడ్డట్టు తాజా పరిణామాలతో కనిపిస్తుంది. హుజురాబాద్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేసిన కేసీఆర్ ఇప్పుడు యువతకు పెద్ద పీట వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే సీఎం కేసీఆర్ టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న, యువ నాయకుడికి అవకాశం ఇవ్వడం వెనుక హుజురాబాద్ ఉప ఎన్నిక రాజకీయమే కాదు, మరో బలమైన కారణం ఉందని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

నిరుద్యోగ యువతలో రోజురోజుకూ పెరుగుతున్న వ్యతిరేకత
గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం పోరుబాట పట్టింది. ఇక ప్రధాన రాజకీయ పార్టీలు కూడా నిరుద్యోగ యువతకు బాసటగా సీఎం కేసీఆర్ పై సమరానికి సై అన్నాయి. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేయడం లేదని, ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు రాక నిరుద్యోగ యువత ఎందరో నిత్య ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిరుద్యోగ యువత లోనూ సీఎం కేసీఆర్ పై, టిఆర్ఎస్ ప్రభుత్వం పై రోజురోజుకు తీవ్ర విముఖత పెరుగుతోంది.

తెలంగాణా వచ్చినా రాని ఉద్యోగాలు.. ఆత్మహత్యలకు పాల్పడుతున్న నిరుద్యోగ యువత
తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో మా ఉద్యోగాలు మాకు కావాలని, తెలంగాణ రాష్ట్ర యువత, నిరుద్యోగులు, స్టూడెంట్లు ప్రధానంగా డిమాండ్ చేశారు. స్వరాష్ట్రం సాధించుకుంటే మన ఉద్యోగాలు మనకు వస్తాయని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ అప్పుడు మాటిచ్చారు. ఇక రాష్ట్రం సాధించి ఏడు సంవత్సరాలు అవుతున్నా, టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు రెండు సార్లు పట్టం కట్టినా ఇప్పటివరకు నిరుద్యోగ సమస్యను పరిష్కరించిన దాఖలాలు లేవు. ఏడు సంవత్సరాలుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురవుతున్న నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉద్యోగం లేదన్న మనస్థాపంతో కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్ సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తర్వాత నిత్యం అనేక చోట్ల నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు అంచనా
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నిరుద్యోగ రేటు 33.8 శాతంగా ఉంది. దేశంలో అత్యధిక నిరుద్యోగిత ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటని పిరియాడిక్ లేబర్ ఫోర్స్ నివేదిక గతంలోనే వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది ఉద్యోగాల కోసం టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా రిజిస్టర్ చేసుకోని వారు పది లక్షల మందికిపైగా ఉంటారని ఒక అంచనా.
ఈ క్రమంలో రాష్ట్రంలో 35 లక్షల మంది నిరుద్యోగులు సీఎం కేసీఆర్ పై తీవ్ర అసహనంతో ఉన్నట్టు సమాచారం .

నిరుద్యోగ సమస్య పై ప్రతిపక్ష పార్టీల పోరుబాట, బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళన
ఇదిలా ఉంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పై నిత్యం పోరాటం చేస్తున్న బిజెపి, కాంగ్రెస్, వైయస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలు సీఎం కేసీఆర్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ఇటీవల బిజెపి నాయకులు రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పై ఆందోళన చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను తక్షణం భర్తీ చేయాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. కొన్నిచోట్ల నిరుద్యోగులు షూ పాలిష్ చేస్తూ తమ నిరసనను తెలియజేశారు.

కాంగ్రెస్ తో పాటు సీఎం కేసీఆర్ పై వైఎస్సార్టీపీ షర్మిల ఒత్తిడి
మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగ చైతన్య యాత్రలు నిర్వహించి యువత పక్షాన నిలిచి పోరాటం సాగిస్తోంది. అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ నిరుద్యోగ సమస్యపై అసెంబ్లీ ముట్టడి యత్నం చేసింది.
ఇదే సమయంలో తెలంగాణా లో వైయస్సార్ తెలంగాణ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన వైయస్ షర్మిల నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం నిరాహార దీక్షలు చేస్తూ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడిన నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శించడంతో పాటుగా, సీఎం కేసీఆర్ ఇంట్లోనే 5 ఉద్యోగాలు ఉన్నాయి అంటూ కెసిఆర్ ను టార్గెట్ చేస్తూ యువతను ఆలోచింపజేస్తున్నారు.

ఇటీవల కేటీఆర్ పర్యటనలకు నిరుద్యోగుల సెగ, అందుకే యువ నాయకుడు గెల్లుకు అవకాశం
ప్రతిపక్ష పార్టీల ఆందోళనల నేపథ్యంలో, నిరుద్యోగ సమస్యపై కొనసాగుతున్న రగడ తో ఇటీవల కేటీఆర్ పర్యటనలకు నిరుద్యోగుల సెగ తగిలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా యువతలో టిఆర్ఎస్ పార్టీ పట్ల విముఖత వ్యక్తం అవుతుందని భావించిన కేసీఆర్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను చాలా పెద్ద స్ట్రాటజీ తో హుజురాబాద్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు.
ఇక ఈ చర్య ద్వారా యువతకు రాజకీయాలలో అవకాశమిస్తే, కొంతమేర వ్యతిరేకత తగ్గుతుందని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమంతో పాటు, స్వయం పాలనలో యువత పాత్ర గొప్పదని, విద్యార్థి యువ నేతలకు చట్టసభల్లో పెద్దఎత్తున అవకాశం కల్పిస్తామని యువతను బుట్టలో వేసుకునే పనిలో పడ్డారు.

హుజురాబాద్ లో ఎన్నికల స్ట్రాటజీతో పాటు యువతను శాంతింపజేసే ప్లాన్
ఈ క్రమంలోనే టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు అవకాశం ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఒక అవకాశం ఇవ్వడం వల్ల ఒనగూరే రాజకీయ ప్రయోజనాల మాట అటుంచి, నిరుద్యోగులలో ఉన్న వ్యతిరేకతను తొలగించడం కోసం సీఎం కేసీఆర్ యువతను ప్రోత్సహిస్తున్నాము అన్న భావన కలిగేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

భవిష్యత్తు తెలంగాణ యువతదే అంటూ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక ఈ రోజు అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువత కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపర్చే దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ వంటి రంగాలను, తెలంగాణ సర్కార్ తీర్చిదిద్దుతోందని, ఉపాధి అవకాశమున్న టూరిజం, లాజిస్టిక్స్ వంటి వినూత్న మార్గాలను కూడా ప్రభుత్వం అన్వేషిస్తోందని చెప్పుకొచ్చారు. స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం పలు పథకాల ద్వారా ఆర్థికంగా సహాయం అందిస్తూ బడుగు బలహీనవర్గాల యువతను ప్రోత్సహిస్తున్నామని చెప్పిన కేసీఆర్ రానున్న రోజుల్లో తెలంగాణలో యువత పాత్ర అన్నిరంగాల్లోనూ కీలకం కాబోతుందని వెల్లడించారు. భవిష్యత్తు తెలంగాణ యువతదే అంటూ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Recommended Video

గెల్లుకు అవకాశం .. యువతలో విముఖత తొలగించే ఒక ప్లాన్
ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది నిరుద్యోగులు చనిపోతున్నా పట్టించుకోని కేసీఆర్, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నా, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నా అవేమి పట్టనట్లు వ్యవహరించిన కెసిఆర్, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక యువ నాయకుడుకి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అవకాశమిచ్చిన పేరుతో యువత కోసం ఎంతో చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర అసహనంతో ఉన్న నిరుద్యోగ యువతను ఒక్క అసెంబ్లీ సీటుతో అనునయించే ప్రయత్నం చేస్తున్నారు కెసిఆర్. ఏది ఏమైనా సీఎం కెసిఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక, చేసే ప్రతి పని వెనుక చాలా పెద్ద స్ట్రాటజీ ఉంటుంది అన్నది తాజా చర్యతో రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతుంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications