హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలమూర్ వెంకట్ ; గెల్లుకు పోటీగా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు?

ఎట్టకేలకు హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల పోరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఫైనల్ చేసినట్లుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుండి హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలోకి బలమూర్ వెంకట పేరును దాదాపుగా అధిష్టానం ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. గెల్లు శ్రీనివాస్ కు బలమైన పోటీ ఇవ్వడానికి బలమూర్ వెంకట్ ను రంగంలోకి దింపుతున్నట్టు సమాచారం.

యూత్ లీడర్ బలమూర్ వెంకట్ హుజురాబాద్ అభ్యర్థిగా

యూత్ లీడర్ బలమూర్ వెంకట్ హుజురాబాద్ అభ్యర్థిగా

ప్రస్తుతం ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వెంకట్ కాంగ్రెస్ పార్టీ నుండి యూత్ లీడర్ గా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. యువతలో మంచి పట్టుంది. టిఆర్ఎస్ సర్కార్ పై పోరాటంలో భాగంగా వెంకట్ అనేక నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నుండి బలమైన ప్రభుత్వ వ్యతిరేకతను వినిపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం అనేక నిరసన కార్యక్రమాలను నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. మంచి యూత్ నాయకుడిగా గుర్తింపు ఉన్న బలమూర్ వెంకట్ ను హుజరాబాద్ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలోకి దింపనున్నట్లుగా సమాచారం.

ఈరోజుతో సస్పెన్స్ కు తెర .. అభ్యర్థి ఆయనే ..

ఈరోజుతో సస్పెన్స్ కు తెర .. అభ్యర్థి ఆయనే ..

గత కొద్ది రోజులుగా హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పై సస్పెన్స్ కొనసాగుతున్న సమయంలో ఎట్టకేలకు ఈ రోజు సస్పెన్స్ కు తెర పడనున్నట్లుగా తెలుస్తోంది. హుజురాబాద్ నియోజకవర్గం నుండి ముందు కొండా సురేఖ ఎన్నికల బరిలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ, ఆమె డిమాండ్ల నేపధ్యంలో కాంగ్రెస్ వ్యూహం మారింది. ఆ తర్వాతి క్రమంలో ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బలమూర్ వెంకట్, వ్యాపారవేత్త రవికుమార్ పేర్లు పార్టీలో తెరమీదకు వచ్చాయి . సుదీర్ఘ మంతనాలు, వరుస సమావేశాల తర్వాత ఫైనల్ గా ఒకే ఒక అభ్యర్థిని ఖరారు చేసి అధిష్టానానికి పంపించినట్లు సమాచారం.

అధికారికంగా బలమూర్ వెంకట్ పేరు ప్రకటన ఛాన్స్

అధికారికంగా బలమూర్ వెంకట్ పేరు ప్రకటన ఛాన్స్

అయితే అధిష్టానానికి పంపించిన లిస్టు లో బలమూరు వెంకట్ పేరు ఉన్నట్లుగా మరికాసేపట్లో అధిష్టానం అధికారికంగా వెంకట్ పేరును ప్రకటించనున్నట్లుగా పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇక నేటి నుండి నామినేషన్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్థిని ప్రకటించి హుజురాబాద్ ఎన్నికల బరిలో జోరుగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. యూత్ లీడర్ తో మరో యూత్ లీడర్ కు చెక్ పెట్టటానికి కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

టీఆర్ఎస్ అభ్యర్థికి పోటీగా కాంగ్రెస్ అభ్యర్థి .. ఒకే స్థాయి నాయకులు

టీఆర్ఎస్ అభ్యర్థికి పోటీగా కాంగ్రెస్ అభ్యర్థి .. ఒకే స్థాయి నాయకులు

ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు , యూత్ నాయకుడు గెల్లు శ్రీనివాస్ కు సీఎం కేసీఆర్ హుజురాబాద్ అభ్యర్థిగా అవకాశమిచ్చారు. ఇక బిజెపి నుండి ఈటల రాజేందర్ హుజురాబాద్ స్థానం కోసం యుద్ధ ప్రాతిపదికన ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకుడు, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ కు అవకాశం ఇచ్చినందుకు, గెల్లు శ్రీనివాస్ కు దీటుగా ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, యూత్ నాయకుడు బలమూర్ వెంకట్ కు అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తుంది. టీఆర్ఎస్ లానే ఒకే స్థాయి నాయకుడికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అని సమాచారం .

హుజురాబాద్ లో హోరాహోరీ పోరు .. ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడు

హుజురాబాద్ లో హోరాహోరీ పోరు .. ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడు

హుజరాబాద్ ఉప ఎన్నికల పోరాటం ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు నుండీ హోరాహోరీగా కొనసాగుతుంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ ను ప్రకటించి, అధికార టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో దూకుడు చూపిస్తుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రులను సైతం రంగంలోకి నుంచి ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తుంది.

మండలాల వారీగా, గ్రామ గ్రామాన పర్యటిస్తూ టిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని, టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది.దళిత బంధు వంటి కొత్త పథకాన్ని తీసుకు వచ్చి హుజురాబాద్ కేంద్రంగా దళితులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలోనే ఇటీవల కాలంలో హుజూరాబాద్ నియోజకవర్గానికి వందల కోట్ల నిధుల వరద కొనసాగుతోంది.

 పట్టు కోసం కష్టపడుతున్న ఈటల రాజేందర్

పట్టు కోసం కష్టపడుతున్న ఈటల రాజేందర్

హుజురాబాద్ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాన్ని అద్దంలా తీర్చి దిద్దే పనిలో పడ్డారు గులాబీ నేతలు. అభివృద్ధిని చూపించి ఓట్లు వేయమని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే బిజెపి నుండి ఎన్నికల బరిలోకి దిగిన ఈటల రాజేందర్ తెలంగాణా ఆత్మ గౌరవాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

హుజురాబాద్ నియోజకవర్గంలో తన పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ, పాదయాత్రలు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. హుజరాబాద్ ఎమ్మెల్యేగా తాను రాజీనామా చేయడం వల్లే ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, తన వల్ల జరుగుతున్న అభివృద్ధిని చూసి తనకు ఓటు వేయాలని ఆయన ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+