Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హుజురాబాద్ గడ్డపై కాషాయ జెండా; ఈ తీర్పు కేసీఆర్ కు కనువిప్పు కావాలి: బండి సంజయ్, డీకే అరుణ వెల్లడి

హుజూరాబాద్ నియోజకవర్గ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతుంది. కౌంటింగ్ ప్రారంభమైన మొదటి రౌండ్ నుండి ఇప్పటివరకు బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్, టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై ఆధిక్యతను కొనసాగిస్తూనే ఉన్నారు. స్పష్టమైన మెజారిటీతో టిఆర్ఎస్ పార్టీని చిత్తు చేసి బిజెపి విజయం సాధిస్తుందని బీజేపీ శ్రేణులు ధీమాతో ఉన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ట్రెండ్ బిజెపికి అనుకూలంగా కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈటల అసెంబ్లీలో అడుగు పెడతారు : బండి సంజయ్ ధీమా

ఈటల అసెంబ్లీలో అడుగు పెడతారు : బండి సంజయ్ ధీమా

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రజల్లో విశ్వాసం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. హుజురాబాద్ కౌంటింగ్ కొనసాగుతున్న సమయంలో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్ లో కాషాయ జెండా ఎగరబోతుంది అని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ ఘన విజయం సాధిస్తారని , అసెంబ్లీలో అడుగు పెడతారని బండి సంజయ్ స్పష్టం చేశారు .

డబ్బును కాదని హుజురాబాద్ ప్రజలు చైతన్యాన్ని చాటారన్న బండి సంజయ్

డబ్బును కాదని హుజురాబాద్ ప్రజలు చైతన్యాన్ని చాటారన్న బండి సంజయ్

హుజురాబాద్ లో బిజెపి అభ్యర్థి గెలవబోతున్నారు అని పేర్కొన్న బండి సంజయ్ ఎవరేమి కామెంట్స్ చేసినా బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ అని పేర్కొన్నారు. ఓటర్లను టిఆర్ఎస్ పార్టీ భయభ్రాంతులకు గురి చేసినా ఫలితం లేదని, డబ్బును కాదని హుజురాబాద్ ప్రజలు చైతన్యాన్ని చాటారని ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్. టిఆర్ఎస్ తో వీరోచిత పోరాటం చేసిన బిజెపి కార్యకర్తలకు బండి సంజయ్ హ్యాట్సాఫ్ తెలిపారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

దళిత బంధు అమలు చేసినా ప్రజలు టీఆర్ఎస్ ను నమ్మటం లేదు : బండి సంజయ్

దళిత బంధు అమలు చేసినా ప్రజలు టీఆర్ఎస్ ను నమ్మటం లేదు : బండి సంజయ్

హుజురాబాద్ లో బీజేపీ గెలుపు ముందే ఊహించామని హామీలు అమలు చేయడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. దళిత బంధు పథకంతో దళితుల ఓటుబ్యాంకు కొల్లగొట్టాలని కేసీఆర్ ప్రయత్నించినా, దళిత బందు అమలు చేసినా ప్రజలు టిఆర్ఎస్ ను నమ్మడం లేదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లోనూ కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్తారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ఓటర్ల తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.

దళిత బంధు ప్రారంభించిన గ్రామంలోనూ బీజేపీదే ఆధిక్యత : డీకే అరుణ

దళిత బంధు ప్రారంభించిన గ్రామంలోనూ బీజేపీదే ఆధిక్యత : డీకే అరుణ

ఇదిలా ఉంటే దళిత బంధు ప్రారంభించిన గ్రామంలోనూ బిజెపి ఆధిక్యం కనబరిచిందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ పేర్కొన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతుండటం బీజేపీ శ్రేణులలో జోష్ పెంచింది.ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ పతనం ప్రారంభమైందని డి.కె.అరుణ వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య జరిగిన పోరాటంలో ఆత్మగౌరవం గెలుస్తుందని డీకే అరుణ పేర్కొన్నారు.

 నియంత పాలనకు చరమ గీతం పాడాలని హుజురాబాద్ ప్రజలు చెప్తున్నారు

నియంత పాలనకు చరమ గీతం పాడాలని హుజురాబాద్ ప్రజలు చెప్తున్నారు

సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని డీకే అరుణ ధ్వజమెత్తారు. అధికార పార్టీ పెద్ద ఎత్తున డబ్బులు వెదజల్లినా, భారీగా డబ్బులు ఖర్చు పెట్టినా ప్రజల ఆత్మగౌరవానికి పెద్దపీట వేశారని డీకే అరుణ పేర్కొన్నారు. నియంత పాలనకు చరమగీతం పాడాలని నియోజకవర్గ ప్రజలు గుర్తు చేస్తున్నారని డీకే అరుణ అభిప్రాయం వ్యక్తం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు టిఆర్ఎస్ పతనానికి నిదర్శనం అంటూ డీకే అరుణ అభిప్రాయపడ్డారు. ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ కుటుంబం కోల్పోయిందని ఆమె పేర్కొన్నారు.

హుజురాబాద్ తీర్పు చారిత్రాత్మకం : డీకే అరుణ

హుజురాబాద్ తీర్పు చారిత్రాత్మకం : డీకే అరుణ


వేల కోట్ల పథకాలకు జీవోలు ఇచ్చినా ప్రజలు కేసీఆర్ ను నమ్మలేదని డీకే అరుణ స్పష్టం చేశారు. ఆరు వేల నుండి పదివేల రూపాయల వరకు ఓట్ల కోసం ఖర్చు పెట్టినా, ప్రజలు డబ్బును కాదని చైతన్యం చూపించారని డీకే అరుణ పేర్కొన్నారు. హుజురాబాద్ తీర్పు కెసిఆర్ కు ఒక కనువిప్పు కావాలని పేర్కొన్న డీకే అరుణ హుజురాబాద్ ఓటర్లకు నా సెల్యూట్ అంటూ పేర్కొన్నారు. హుజురాబాద్ ప్రజల తీర్పు చారిత్రకమైనదని ఆమె తెలిపారు. కెసిఆర్ ను తెలంగాణ ప్రజలు ఓడించారని డీకే అరుణ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం హుజురాబాద్ తీర్పును కోరుకుంటోందని ఆమె వచ్చే ఎన్నికల నాటికి బిజెపి బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+