Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Huzurnagar by election results: బెట్టింగ్ రాయుళ్ళు బిజీ బిజీ..కారు జోరు..10 కోట్ల పైగా బెట్టింగ్ లు

తెలంగాణలో కీలకమైన హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితం నేడు వెలువడనుంది. ఇప్పటికే విజయం ఎవరిది అన్న దానిపై ఒక క్లారిటీ వచ్చేసింది. కారు జోరుకు హస్తం పార్టీ కుదేలవుతుంది. నువ్వా నేనా అంటూ సాగిన పోరాటంలో విజయం ఎవరిది అన్న దానిపై ఎన్నికల నుండు నుండీ జోరుగా బెట్టింగ్ లు కాశారు బెట్టింగ్ రాయుళ్ళు. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ కలిగించిన ఈ ఎన్నికపై కోట్ల బెట్టింగ్ దందా జరిగిందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. గెలుపు పైనే కాకుండా, మెజార్టీ పైన కూడా జోరుగానే బెట్టింగ్ జరిగింది.

బెట్టింగ్ రాయుళ్ళలో హుజూర్ నగర్ రిజల్ట్ టెన్సన్

బెట్టింగ్ రాయుళ్ళలో హుజూర్ నగర్ రిజల్ట్ టెన్సన్

హుజుర్‌నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ ఆరంభం నుండి కారు పార్టీనే ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. కారు దూకుడుతో టీఆర్ఎస్ పార్టీ గెలుపు దాదాపు తేలిపోయింది. ఇప్పటికే ఆధిక్యంతో దూసుకుపోతున్న కారు చివరి రౌండ్ ముగిసేసరికి భారీ మెజార్టీ సాధించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ఉప ఎన్నిక ఫలితంపై రాజకీయ వర్గాలే కాదు బెట్టింగ్ బాబులు బిజీగా ఉన్నారని సమాచారం. టీఆర్ ఎస్ పార్టీ కోసం బెట్టింగ్ పెట్టిన వాళ్ళు సంతోషంగా ఉంటె కాంగ్రెస్ పార్టీ తరపున బెట్టింగ్ వేసి ఓడిపోయినవాళ్ళు బాధలో ఉన్నారు.

రూ.10 కోట్లకు పైగానే సాగిన బెట్టింగ్

రూ.10 కోట్లకు పైగానే సాగిన బెట్టింగ్

భారీ ఉత్కంఠ ఏర్పడిన ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే నియోజకవర్గం వ్యాప్తంగా మాత్రమే కాకుండా ఏపీలో సైతం బెట్టింగ్‌లు కాసినట్టు సమాచారం. చాలా మంది ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా భావించి సొంత పార్టీ నేతలతోనే కాకుండా ఇతర పార్టీల నేతలతో కూడా బెట్టింగ్‌లకు దిగినట్లు తెలుస్తోంది. అంతేకాక నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు రూ.10 కోట్లకు పైగానే బెట్టింగ్ నడుస్తున్నట్లు సమాచారం. ఇక దీంతో నేడు అభ్యర్థుల కంటే బెట్టింగ్ రాయుల్లకే ఎక్కువ టెన్షన్ ఉంది. ఫలితాలపై ఆసక్తితో చూస్తున్న బెట్టింగ్ రాయుళ్ళు టీఆర్ఎస్ విజయం దాదాపు ఖరారు కావటంతో మెజార్టీ మీద దృష్టి పెట్టారు.

ఎవరి అంచనాలతో వారు బెట్టింగ్స్

ఎవరి అంచనాలతో వారు బెట్టింగ్స్

ఇక ఈ ఉప ఎన్నికల ప్రచారం నాటి నుండే పెద్ద ఎత్తున బెట్టింగ్ లకు దిగితే, ఈ నెల 21న జరిగిన పోలింగ్ అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా కొందరు బెట్టింగ్‌కు పాల్పడ్డారు. ఏది ఏమైనా అభ్యర్థుల కంటే బెట్టింగ్ రాయుళ్లే ఎన్నికల పైన, ఫలితాలపైన పెద్ద ఎత్తున విశ్లేషణలు చేస్తున్నట్టు సమాచారం. పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితం టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది అని చెప్పాయి.

కాంగ్రెస్ ను నమ్మినబెట్టింగ్ రాయుళ్ళు నట్టేట మునిగినట్టే

కాంగ్రెస్ ను నమ్మినబెట్టింగ్ రాయుళ్ళు నట్టేట మునిగినట్టే

ప్రజల్లో అధికార టీఆర్ ఎస్ మీద వ్యతిరేఖత ఉందని, అది కాంగ్రెస్ కు లాభిస్తుంది అని కాంగ్రెస్ పార్టీ సైతం ధీమా వ్యక్తం చెయ్యటంతో బెట్టింగ్ రాయుళ్ళు కొందరు మొదటి నుండి ఆ స్థానం కాంగ్రెస్ ఖాతాలో ఉంది అని భావించి మళ్ళీ కాంగ్రెస్ కే పట్టం కడతారని బెట్టింగ్ వేశారు. తెలంగాణా రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సంకేతంగా మారనున్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక అటు కాంగ్రెస్ కు,ఇటు టీఆర్ఎస్ కు ప్రతిష్ఠాత్మకం కావటంతో ఈ స్థానంపై పెద్ద ఎత్తున బెట్టింగ్ లు పాల్పడినట్టు తెలుస్తుంది.కాంగ్రెస్ ను నమ్మినవారు నట్టేట మునిగినట్టే అని ఇప్పటికే అర్ధం అయ్యింది. భారీగా కాంగ్రెస్ గెలుస్తుంది అని బెట్టింగ్ పెట్టిన వారు లబోదిబో అంటుంటే, టీఆర్ఎస్ మీద బెట్టింగ్ పెట్టిన వారు బాగా జోష్ లో ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+